యాప్నగరం

చెంప చెళ్లుమనిపించిన ఎస్సై.. తిరిగికొట్టిన గొర్రెల కాపరి.. అసలేమైందంటే!

కర్నూలు జిల్లాలో ఎస్సై, గొర్రెల కాపరి పరస్పర దాడి. రోడ్డుకి అడ్డంగా గొర్రెలు రావడంతో పరుష పదజాలంతో దూషించడంతో తిరగబడిన గొర్రెల కాపరి. ఎస్సై ఫోన్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.

Samayam Telugu 16 Nov 2019, 6:00 pm
గొర్రెల కాపరి చెంప చెళ్లుమనిపించడంతో ఎస్సైపై తిరిగి దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. బైక్‌కి దారిచ్చే విషయంలో వాగ్వాదం జరగడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్సైపై తిరగబడడంతో అక్కడికి పోలీసులు చేరుకోవడంతో గొర్రెల కాపరి పరారైనట్లు తెలుస్తోంది. రోడ్డుపై వెళ్తూ ఎస్సై దూషించడంతో అదే స్థాయిలో గొర్రెల కాపరి సమాధానం చెప్పాడని.. చేయి చేసుకోవడం వల్లే తిరగబడినట్లుగా సమాచారం.
Samayam Telugu goats-on-


పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్, గొర్రెల కాపరి పరస్పరం దాడి చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో చోటు చేసుకుంది. ఆదోని వెళ్లేందుకు హాలహర్వి ఎస్సై బాలనరసింహులు బైక్‌పై బయలుదేరారు. మనేకుర్తి - గోనేహాలు గ్రామాల మధ్య గొర్రెలు అడ్డుగా రావడంతో బైక్‌ని ఆపాడు. గొర్రెలను పక్కకు తోలకుండా ఏం చేస్తున్నావంటూ దూషించినట్లు తెలుస్తోంది. అవి మూగజీవాలు.. వాటికి తెలియదంటూ గొర్రెల కాపరి బీరప్ప కాస్త గట్టిగానే సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: లాడ్జిలో రెచ్చిపోయిన కానిస్టేబుల్.. విషయం ఎస్పీకి లీక్.. సీన్ కట్‌ చేస్తే..

వెంటనే ఎస్సై బాలనరసింహులు బైక్ దిగి గొర్రెల కాపరి చెంప చెళ్లుమనిపించాడు. యూనిఫాంలో లేకపోవడంతో పోలీస్ అని గుర్తించని బీరప్ప కూడా ఎస్సైపై తిరగబడినట్లు సమాచారం. ఇద్దరూ పరస్పరం దాడి చేసుకోవడంతో ఎస్సై వెంటనే ఆలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి గొర్రెల కాపరి బీరప్ప పరారైనట్లు తెలుస్తోంది.

Read Also: అనంతపురంలో మహిళ దారుణ హత్య.. అక్రమ సంబంధమే కారణమా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.