యాప్నగరం

మీరు దేవుళ్లయ్యా.. ఆస్పత్రి, పోలీస్ స్టేషన్‌ల ముందు కొబ్బరి కాయలు కొట్టి పూజలు

ప్రజల కోసం సేవలు చేస్తున్న పోలీసులు, వైద్య సిబ్బందికి వినూత్నంగా ధన్యవాదాలు తెలిపిన కడప జిల్లాకు చెందిన వ్యక్తి. పోలీస్ స్టేషన్, ఆస్పత్రుల దగ్గర కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేకంగా పూజలు.

Samayam Telugu 26 Mar 2020, 8:12 am
కరోనా భయం అందర్ని వణికిస్తోంది. లాక్‌డౌన్‌లతో పాటూ సామాజిక దూరం, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌కు బ్రేకులు వేయొచ్చు. ఇక లాక్‌డౌన్ సమయంలో పోలీసులు.. అటు ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు తమవంతు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. తమ విధుల్లో భాగంగా ప్రజల కోసం సేవ చేస్తున్నారు. జనతా కర్ఫ్యూ పాటించి.. ఆదివారం సాయంత్రం 5 గంటలకు వైద్య సిబ్బందికి చప్పట్లతో ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే.
Samayam Telugu kdp.


మరి ఇలాంటి కష్ట సమయంలో ప్రజల కోసం కష్టపడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులకు వినూత్నంగా ధన్యవాదాలు తెలిపాడో వ్యక్తి. వాళ్లను దేవుళ్లగా భావిస్తూ.. తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. కరోనా వైరస్‌ కట్టడికి అహర్నిశలూ కృషిచేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులను దేవుళ్లుగా అభివర్ణిస్తూ.. కడప జిల్లా కొండాపురం మండలంలోని ఓబన్నపేట గ్రామానికి చెందిన సద్దాం అనే యువకుడు ఆస్పత్రి, పోలీస్‌ స్టేషన్ల వద్ద మొక్కుతున్నాడు.

సద్దాం ఉగాది రోజు కొండాపురంలోని ప్రభుత్వ ఆస్పత్రి, పోలీస్‌స్టేషన్‌ దగ్గర కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకున్నాడు. ప్రజలకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కాపాడుతున్న పోలీసులు, వైద్య సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరుతున్నాడు. ఇలా వైద్య సిబ్బంది, పోలీసులపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.