యాప్నగరం

శ్రీకాకుళం: ఆర్టీసీ బస్సులో కరోనా రోగి జర్నీ.. ప్రయాణికుల్లో టెన్షన్

శ్రీకాకుళం వెళ్లిన తర్వాత అతడికి పరీక్ష చేయగా కరోనా పాటిజివ్‌గా తేలింది. శ్రీకాకుళం పోలీసులు అడిగిన సమాచారంతో రాజమహేంద్రవరం మెయిన్ బస్టాండ్ నుంచి విశాఖకు అతనితోపాటు అదే బస్సులో ఎంతమంది ప్రయాణించారనే వివరాలను ఇక్కడి ఆర్టీసీ అధికారులు సేకరించారు.

Samayam Telugu 30 May 2020, 10:29 am
ఏపీని కరోనా టెన్షన్ వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే బస్సు ప్రయాణాలు కూడా జనాల్ని ఆందోళనలో పడేస్తున్నాయి. తాజాగా బస్సులో ప్రయాణించిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. దీంతో అతడితో పాటూ ఆ బస్సులో ప్రయాణించినవారిలో టెన్షన్ మొదలైంది. అతడు ఎక్కడ బస్సెక్కాడు.. ఎక్కడ దిగాడో ఆరా తీస్తున్నారు.
Samayam Telugu ఆర్టీసీ


ఈ నెల 23న విజయవాడ నుంచి శ్రీకాకుళానికి వెళ్లాడు. అతడు రాజమహేంద్రవరం, విశాఖపట్నం డిపోల్లో బస్సులు మారాడు. శ్రీకాకుళం వెళ్లిన తర్వాత అతడికి పరీక్ష చేయగా కరోనా పాటిజివ్‌గా తేలింది. శ్రీకాకుళం పోలీసులు అడిగిన సమాచారంతో రాజమహేంద్రవరం మెయిన్ బస్టాండ్ నుంచి విశాఖకు అతనితోపాటు అదే బస్సులో ఎంతమంది ప్రయాణించారనే వివరాలను ఇక్కడి ఆర్టీసీ అధికారులు సేకరించారు. మొత్తం 14మంది ఆ రోజు విశాఖకు వెళ్లే బస్సు ఎక్కినట్లు గుర్తించారు. ఆ బస్సులో ప్రయాణికుల వివరాలు సేకరించి వారిని క్వారంటైన్‌కు తరలించే పనిలో ఉన్నారు. వారి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించేందుకు సిద్ధమయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.