యాప్నగరం

కరోనా భయం.. కేసీ కెనాల్‌లోకి బిడ్డ మృతదేహం విసిరేసిన తండ్రి

Kurnool: పుట్టెడు దు:ఖంలో ఆ భార్యాభర్తలు ఆ శిశువును గ్రామానికి తీసుకెళ్లి ఖననం చేయాలని నిర్ణయించారు. మదార్‌బీ భర్త షాంషావలీ బిడ్డ మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్లేందుకు గ్రామపెద్దలను ఫోన్‌లో సంప్రదించాడు.

Samayam Telugu 19 Jul 2020, 8:49 am
కరోనా మహమ్మారిపై ఉన్న భయం సాధారణ వ్యక్తులను కూడా అమానవీయ చర్యలకు పాల్పడేలా చేస్తోంది. ఇందుకు కర్నూలు జిల్లాలో జరిగిన తాజా ఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కర్నూలు జిల్లా కోటపాడుకు చెందిన మదార్‌బీ అనే మహిళ శుక్రవారం జిల్లాలోని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, దురదృష్టవశాత్తు పుట్టిన వెంటనే శిశువు చనిపోయింది. పుట్టెడు దు:ఖంలో ఆ భార్యాభర్తలు ఆ శిశువును గ్రామానికి తీసుకెళ్లి ఖననం చేయాలని నిర్ణయించారు. మదార్‌బీ భర్త షాంషావలీ బిడ్డ మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్లేందుకు గ్రామపెద్దలను ఫోన్‌లో సంప్రదించాడు. దీనికి వారు నిరాకరించారు.
Samayam Telugu కాల్వలో పడేసిన శిశువు
man throws his dead new born baby into canal due to corona fear in kurnool


ఆసుపత్రుల్లో కరోనా రోగులు కూడా ఉంటున్నారని మృతదేహాన్ని ఊళ్లోకి తేవొద్దని గ్రామ పెద్దలు తేల్చి చెప్పేశారు. దిక్కుతోచని షాంషావలీ శనివారం ఆ శిశువు శవాన్ని కేసీ కెనాల్‌లో పడేసి వెళ్లిపోయారు. స్థానికులు మృతదేహాన్ని చూసి అధికారులకు సమాచారం అందించారు. బిడ్డ చేతికి ఉన్న ట్యాగ్‌ ఆధారంగా షాంషావలీకి సమాచారమిచ్చారు. ఆయన వచ్చి మళ్లీ మృతదేహాన్ని తీసుకెళ్లారు.

మరోవైపు, ఇదే జిల్లాలోని ఆళ్లగడ్డ పట్టణంలో మరో హృద్యమైన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మూడు రోజుల క్రితం ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఆయన వయసు 50 ఏళ్లలోపే ఉంది. దీంతో వైద్యాధికారులు ఇంటి సమీపంలోనే ప్రత్యేక గదిలో హోం ఐసొలేషన్‌లో ఉంచారు. నిరంతరం మందులు అందించేలా ఏర్పాట్లు చేశారు. కానీ, శనివారం అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం విషమించింది. వెంటనే ప్రైవేటు అంబులెన్సును పిలిపించి అందులోకి ఎక్కిస్తుండగానే చనిపోయారు.

ఒక వైపు భర్త విగతజీవిగా పడి ఉండడం చూసి, దిక్కుతోచక రోదిస్తున్న భార్యను చూసి స్థానికులు చలించిపోయారు. ఆమె పీపీఈ కిట్‌ ధరించి ఉన్నారు. ఆ దృశ్యం స్థానికులను కలచివేసినా, కరోనా భయంతో ఎవరూ దగ్గరకు కూడా రాలేదు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు పూర్తిచేశారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.