యాప్నగరం

Taraka Ratna ఆరోగ్యంపై మంచు మనోజ్ స్పందన.. కండీషన్ అదేనట

Taraka Ratna బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు అక్కడికి వెళ్లి తారకరత్నను చూస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. తాజాగా.. హీరో మంచు మనోజ్ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లారు. తారకరత్న కుటుబం సభ్యులతో మాట్లాడారు. ఆయనను చూశానని.. ఆయన త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నాను అని మంచు మనోజ్ చెప్పారు. కోలుకుంటున్న తీరుపై వైద్యులు సంతృప్తిగా ఉన్నారని మనోజ్ వివరించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 29 Jan 2023, 9:27 pm

ప్రధానాంశాలు:

  • హృదయాలయలో తారకరత్నకు చికిత్స
  • హృదయాలయకు వెళ్లిన మంచు మనోజ్
  • త్వరగా కోలుకోవాలని మంచు మనోజ్ ప్రార్థన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Manchu Manoj with Tarakaratna family members
తారకరత్న కుటుంబ సభ్యులతో మంచు మనోజ్
Taraka Ratna త్వరలో మన ముందుకు వస్తారని.. హీరో మంచు మనోజ్ చెప్పారు. బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రికి వెళ్లిన మనోజ్.. తారకరత్నను చూశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థిపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. సినీ, రాజకీయ హృదయాలయ ఆసుపత్రికి వస్తున్నారు. ఉదయం తారకరత్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆయనను చూసేందుకు రాగా.. సాయంత్రం హీరో మంచు మనోజ్ (Manchu Manoj) తారకరత్న చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వచ్చారు.
ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసినట్లు హీరో మంచు మనోజ్ వెల్లడించారు. తారకరత్న క్రమంగా కోలుకుంటున్నారని.. కోలుకుంటున్న తీరుపై వైద్యులు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని మంచు మనోజ్ ఆకాంక్షించారు. నారాయణ హృదయాలయ వైద్యశాలలో చికిత్స పొందుతున్న తారకరత్నను.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వసుంధర, బ్రాహ్మణి చూశారు. కర్ణాటక (Karnataka) ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ ఆసుపత్రికి వచ్చి తారకరత్నకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. సీఎం బొమ్మై కూడా వైద్య సేవలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.