యాప్నగరం

YSRCP ఎమ్మెల్యే అరెస్ట్.. మంగళగిరిలో టెన్షన్, టెన్షన్

అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తత.. ర్యాలీకి ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఉద్రిక్త వాతావరణం.

Samayam Telugu 13 Jan 2020, 11:53 am
అమరావతిలో ఉద్రిక్తత ఏర్పడింది. రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ర్యాలీకి సిద్ధమయ్యారు. పార్టీ కార్యకర్తలతో కలిసి.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వరకు ఆళ్ల ర్యాలీని నిర్వహించాలని భావించారు. కానీ 144 సెక్షన్ అమలులో ఉందని.. ర్యాలీకి అనుమతి లేకపోవడంతో.. పోలీసులు అడ్డుకున్నారు.
Samayam Telugu rk


ఆళ్ల రామకృష్ణారెడ్డని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. తాను ర్యాలీ చేసి తీరుతానని.. ఆయన పట్టుబట్టడంతో పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. పలువురు వైసీపీ కార్యకర్తల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.. మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఆయన్ను విడుదల చేశారు.

ఐదేళ్లలో చంద్రబాబు రాజధాని పేరుతో రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆర్కే మండిపడ్డారు. రాజధానిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయక ముందే ప్రజల్ని రెచ్చగొడుతున్నారని.. రైతుల్ని తప్పుదోవ పట్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆర్కే ఆరోపించారు. బీహార్‌లో జరిగిన ఘటనల్ని తీసుకొచ్చి.. అమరావతిలో జరిగినట్లు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదన పరిపాలన వికేంద్రీకరణ కోసమేనన్నారు. రాష్ట్రానికి మేలు జరుగుతుంటే ప్రతిపక్షాలు ఈర్ష్య ప్రదర్శిస్తున్నాయన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.