యాప్నగరం

నెల్లూరు జిల్లాలో మిస్సైల్ కలకలం.. ఆరా తీసి అంతా అవాక్కు

సముద్ర తీరంలో మిస్సైల్ శకలం కనిపించడంతో స్థానికులు అవాక్కయ్యారు. వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఏం జరిగిందని ఆరా తీశారు.

Samayam Telugu 7 Dec 2020, 8:06 am
నెల్లూరు జిల్లాలో మిస్సైల్ కలకలంరేపింది. పెదపాళెం సముద్ర తీరంలో మిస్సైల్ శకలం కనిపించడంతో స్థానికులు అవాక్కయ్యారు. వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఏం జరిగిందని ఆరా తీశారు.. ఇస్కపల్లి మెరైన్‌ సీఐ పెంచలరెడ్డి, ఎస్‌ఐలు రసూల్‌ సాహెబ్, మహేంద్రలు శకలాలను పరిశీలించారు. ఆ శకలం జెట్‌ విమాన శకలం కాదని, ఎయిర్‌ఫోర్స్‌ మిస్సైల్‌ అని మెరైన్‌ నిర్థారించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Samayam Telugu marine officials gives clarity on nellore district missile
నెల్లూరు జిల్లాలో మిస్సైల్ కలకలం.. ఆరా తీసి అంతా అవాక్కు


ఈ మిస్సైల్ శకలం గుంటూరు జిల్లా సూర్యలంక తీరం నుంచి గతంలో ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు ప్రయోగించిన మిస్సైల్‌ అని మెరైన్ పోలీసులు తేల్చారు. దీన్ని సముద్రంపై ఎంత ఎత్తులో గాలి ఉంటుందో తెలుసుకునేందుకు ఉపయోగిస్తారని తెలిపారు. ఇలాంటివి మూడు ప్రయోగించగా.. ఇప్పటికి 2 లభించాయని.. తాజాగా విడవలూరు మండల తీర ప్రాంతంలో మరొకటి బయటపడిందన్నారు. దీన్ని ఇస్కపల్లి మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి మెరైన్‌ అధికారులకు సమాచారం ఇచ్చామని త్వరలోనే వారు దీనిని తీసుకువెళతారని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.