యాప్నగరం

ఏపీ రాజధానిపై నాగబాబు జబర్దస్త్ పంచ్.. నెటిజన్ల నుంచి అదిరిపోయే కామెంట్స్

ఏపీ రాజధాని వ్యవహారంపై మెగాబ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ట్వీట్‌‌పై నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఇద్దరు వాళ్లేగా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

Samayam Telugu 5 Jan 2020, 3:37 pm
ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనలతో అమరావతి ప్రాంత రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. సుమారు 18 రోజులుగా రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. రాజధానిపై అధ్యయనం కోసం నియమించిన జీఎన్ రావు కమిటీ.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కూడా మూడు రాజధానులకు అనుకూలంగా నివేదికలు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి తరలింపునకు నిరసనగా రైతుల నిరసనలు.. దీక్షలకు విపక్షాలు మద్దతు ప్రకటించాయి కూడా.
Samayam Telugu amaravati1 (2)


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధానిలో పర్యటించి రైతులకు మద్దతు తెలియజేశారు. అంతకుముందే రాజధాని కమిటీ ఏర్పాటు చేసి రైతులకు సంఘీభావం తెలపాల్సిందిగా పంపించారు. ఆ కమిటీలో సభ్యులుగా ఉన్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాదెండ్ల మనోహర్, మెగా బ్రదర్ నాగబాబు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. రైతుల నిరసన దీక్షలకు సంఘీభావం తెలియజేశారు.

Also Read: కూర్చొని తింటున్న అమరావతి రైతులు త్యాగమూర్తులా? వైసీపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు

తాజాగా మరోసారి మెగాబ్రదర్ నాగబాబు ఈ వ్యవహారంపై స్పందించారు. ఏపీ రాజధాని.. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజలు నలిగిపోతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ఇద్దరు ఎవరన్న విషయాన్ని మాత్రం ప్రజలకే వదిలేశారు. దీంతో ఆయన ట్వీట్‌పై నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. అంతేగా నాగబాబు గారు అంటూ ఓ నెటిజన్ సెటైర్లు వేయగా.. మరొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చంద్రబాబు, జగన్ అని కామెంట్ చేశారు. వాళ్లిద్దరు కేవలం వ్యాపారులు కాదని.. మాఫియా గ్యాంగులంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు. అనైతిక మీడియా మద్దతుతో మాఫియా నడిపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also:ఏసీబీ డీజీపై బదిలీ వేటు.. సీనియర్ ఐపీఎస్‌ను ఏరికోరి తెచ్చుకున్న జగన్.!

‘ఒక చోట నుంచే పాలన, అన్ని చోట్లా అభివృద్ధి.. అది కర్నూలో.. వైజాగ్.. లేక అమరావతో తేల్చి చెప్పండంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. అందుకు అందరినీ ఒప్పించాలని.. లేకుంటే ఎక్కడ రాజధాని చేస్తామో అక్కడే అభివృద్ధి అనేట్లయితే 13 జిల్లాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలన్నారు. అప్పుడు అందరికీ బాగుంటుందంటూనే.. పరిపాలన చేతకాక అంటూ ఘాటు విమర్శలు చేస్తూ కామెంట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.