యాప్నగరం

పవన్ కళ్యాణ్ చెప్పింది అక్షరాలా నిజం.. ఇక, ఫ్యూచర్లోనూ ఆ ఛాన్స్ లేదు: మంత్రి అంబటి

జనసేనాని పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రాజకీయాల విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 4 Dec 2022, 5:30 pm
Samayam Telugu పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫొటో)
తానొక ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడినన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సెటైర్లు పేలుతున్నాయి. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో శనివారం జరిగిన సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సుకు జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై.. తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానొక ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడినని, ఇలా చెప్పేందుకు తనకెలాంటి మొహమాటం లేదని పేర్కొన్నారు.

అయితే, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ముమ్మాటికీ వాస్తవమేనని తాజాగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారనేది పూర్తిగా వాస్తవమని, ఆయన కేవలం నటుడిగానే విజయవంతం అయ్యారని చెప్పారు. పవన్ రాజకీయాల్లో ఎప్పటినుంచో ఉన్నా.. ఒక్కసారి కూడా గెలిచింది లేదని ఎద్దేవా చేశారు. ఇకపై కూడా పవన్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవన్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక సైద్ధాంతిక విధానమంటూ పాటించలేకపోతున్నారని మంత్రి అంబటి విమర్శించారు. విప్లవనేతగా పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. తనని తాను చేగువేరా అని చెప్పుకుంటాడని, కానీ, సిద్ధాంతాలను పక్కనబెట్టి బీజేపీతో కలిశారని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఫెయిల్యూర్ నాయకుడేనని స్పష్టం చేశారు.

ఇక, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించడంపై అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై అభూత కల్పనలు సృష్టించి, చంద్రబాబు లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 లోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని మాటిచ్చిన చంద్రబాబు.. ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు నిర్వాకం వల్లే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని.. అన్ని అడ్డంకుల్ని అధిగమించి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని, ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి చంద్రబాబుని కూడా పిలుస్తామని వ్యాఖ్యానించారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.