యాప్నగరం

ఉమా అంటే ఆడో, మగో తెలియదు.. మంత్రి అనిల్ వివాదాస్పద వ్యాఖ్యలు

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే 2021 పూర్తయ్యే నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

Samayam Telugu 5 Feb 2020, 9:38 pm
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఉద్దేశించి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉమా అంటే ఆడానా, మగానా తేడా తెలియని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. బుధవారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఉమా గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాగే అన్నారని పేర్కొన్నారు. ఉమా ప్రెస్‌మీట్ పెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి, తనపైనా విమర్శలు చేశారని తెలిపారు.
Samayam Telugu minister anil


Also Read: ఆ పని చేస్తే వైసీపీకి మద్దతు.. టీడీపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తన 14 సంవత్సరాల పాలనలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా అని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. దమ్ముంటే ఈ విషయంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు దోపిడీ చేశారని, పోలవరం పేరుతో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. 35 శాతం కూడా పోలవరం పనులు చేయకుండా.. కాంక్రీటులో గిన్నిస్‌ రికార్డులు వచ్చాయని దుష్ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు..

Also Read: జగన్ సర్కారు కీలక నిర్ణయం.. దొనకొండకు భారీ ప్రాజెక్టు!

2021 పూర్తయ్యే నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని.. ప్రారంభోత్సవానికి దేవినేని ఉమాను కూడా ఆహ్వానిస్తామన్నారు. అప్పుడు ఉమాకు కొత్త బట్టలు కూడా పెడతామని, అవి ఎలాంటి బట్టలు కావాలో మీరే డిసైడ్ చేసుకోండంటూ సెటైర్లు వేశారు. రివర్స్‌ టెండరింగ్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ రూ. వెయ్యి కోట్లు ఆదా చేశారని, తమ దోపిడి వ్యవహారం బయటకు వస్తుండటంతో తట్టుకోలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Also Read: ‘రోజా ఎమ్మెల్యేగా ఉన్నా నటిస్తున్నారు.. పవన్ సినిమాలు చేస్తే తప్పేంటి’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.