యాప్నగరం

ఏపీ దివాళా తీసింది వారిద్దరి వల్లే.. మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు కలిసి రాష్ట్రాన్ని దివాళా తీసేలా చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

Samayam Telugu 4 May 2020, 7:44 pm
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు తీయడంతో వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. మద్యం దుకాణాలు తెరవడంపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఆర్థిక మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లాభాల కోసం ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వం ధనార్జన కోసం చూస్తుందన్న విమర్శలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు.
Samayam Telugu బొత్స సత్యనారాయణ


టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ఏం సాధించాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, యనమల కలిసి రాష్ట్రాన్ని దివాళా తీసేలా చేశారని ధ్వజమెత్తారు. కరోనా కష్టకాలంలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు.

కమీషన్లు కోసం కక్కుర్తి పడటం టీడీపీ నేతల బుద్ధి అని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం తమ ఉద్దేశమని, అందులో భాగంగానే ధరలు పెంచినట్లు స్పష్టం చేశారు. అలాగే మద్యం తాగే వారిని తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజల యోగక్షేమాలు టీడీపీ నేతలకు అవసరం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా తీయాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారా అని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరల పెరగకుండా రూ.3 వేల కోట్ల ప్రత్యేక నిధి ద్వారా నియంత్రణ చేస్తున్నామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.