యాప్నగరం

మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృవియోగం

మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబంలో విషాదం నెలకుంది. ఆయన తల్లి ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Samayam Telugu 16 Aug 2020, 8:29 am
ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి ఈశ్వరమ్మ (84) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. దాదాపు నెల రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతోన్న అమె విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. వయసుపై బడటంతో అనారోగ్యం బారినపడ్డారు. బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
Samayam Telugu మంత్రి బొత్స సత్యనాారాయణ


Read Also: అల్పపీడన ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. 19 న మరో అల్పపీడనం
ఆమెకు మొత్తం 11 మంది సంతానం కాగా.. ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమారుడు కాగా రెండో కుమారుడు బొత్స అప్పల నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయనగరంలోని స్వర్ఘధామంలో ఆమె అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నాం నిర్వహించనున్నారు.

Read Also: గోదావరి మహోగ్రరూపం.. బిక్కుబిక్కుమంటున్న లంక గ్రామాల ప్రజలు
ఈశ్వరమ్మ మరణవార్త తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. బొత్సకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతికలగాలని తమ సానుభూతి తెలిపారు. ఇక, విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్స సత్యనారాయణ గెలుపొందగా.. గజపతినగరం నియోజకవర్గం నుంచి అప్పల నరసయ్య ఎన్నికయ్యారు.

Read Also: తిరుమల: సెప్టెంబరు 19 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.