యాప్నగరం

Lokesh: ఒంట్లో కొవ్వునైనా కరిగించగలరు.. కానీ, ఏం చేసినా ఇతడిని మాత్రం.. కొడాలి నాని ఓ రేంజ్‌లో..!

టీడీపీ యువనేత నారా లోకేష్‌పై మంత్రి కొడాలి నాని ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. ఈ మేరకు కార్టూన్ వైరల్‌గా మారింది.

Samayam Telugu 1 Dec 2021, 4:48 pm
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. నారా లోకేష్‌కు ఏమీ తెలియదు అన్నట్లుగా మీమ్ తయారు చేసి ట్వీట్ చేశారు. కనీసం మామిడి పండు కూడా తినడం చేతకాని వ్యక్తిగా లోకేష్‌ను చిత్రీకరించారు. ‘‘లోకేష్‌కు చెప్పులు మార్చగలరు.. అతని బట్టలు మార్చగలరు.. అతని ఒంట్లో కొవ్వును కూడా కరిగించగలరు.. కానీ, ఏం చేసినా మీరు అతణ్ణి మాత్రం మార్చలేరు!’’ అంటూ కొడాలి నాని సెటైర్లు వేశారు.
Samayam Telugu కొడాలి నాని



ఇక లోకేష్ కార్టూన్ వేసి.. అందులో మామిడి పండును ఫోర్క్‌తో తినేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చిత్రీకరించారు. దీంతో పక్కన ఉన్న వెయిటర్.. సార్ అన్ని పదార్థాలు ఫోర్క్, స్పూన్‌తో తినలేమంటూ వ్యంగంగా రియాక్ట్ అవుతుంది.. అక్కడే పక్కన ఉన్న మరో వెయిటర్.. ‘‘Eating Mango is an art Sir.. మామిడి పండును రెండు చేతులతో పట్టుకుని దాని గుజ్జును పీల్చాలి సార్..’’ అంటూ సెటైర్ వేస్తాడు. వీరి మాటల్ని లోకేష్ అయోమయంగా చూస్తుంటారు.

ఈ తరహా కార్టూన్లను మంత్రి కొడాలి నాని ఇటీవలి కాలంలో తరచూ ట్వీట్ చేస్తున్నారు. నారా లోకేష్‌ను, చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తూ ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు. నోరు తెరిస్తే బండబూతులతో రెచ్చిపోయే మంత్రి కొడాలి నాని.. సోషల్ మీడియాలో మాత్రం ఈ తరహా సెటైర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.