యాప్నగరం

ముఖ్యమంత్రి అయినా జగన్ సంతోషంగా లేరు.. మంత్రి విశ్వరూప్ ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం అయినా జగన్ సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 4 May 2022, 12:08 pm
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా సంతోషంగా లేరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి తెచ్చిన ఆర్థిక సంక్షోభంతో సీఎం జగన్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పినిపె విశ్వరూప్, మాజీ మంత్రి పేర్ని నానిని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోషియేషన్ నేతృత్వంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లారీ యజమానులు పడుతోన్న కష్టాలను మంత్రి విశ్వరూప్‌ దృష్టికి తీసుకెళ్లారు.
Samayam Telugu minister pinipe viswarup interesting comments over ap cm ys jagan mohan reddy
ముఖ్యమంత్రి అయినా జగన్ సంతోషంగా లేరు.. మంత్రి విశ్వరూప్ ఆసక్తికర వ్యాఖ్యలు



రాష్ట్రంలో లారీ యజమానులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని.. వారి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోషియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇతర రాష్ట్రాల కంటే రాష్ట్రంలో డీజిల్ రేట్లు, జరిమానాలు ఎక్కువగా ఉండటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్లు అసోసియేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. లారీలపై అధికారులు వేస్తోన్న జరిమానాలు తగ్గించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం ఇచ్చేందుకు సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ కోసం మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌తో అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తే.. సమస్యలు వివరిస్తామని మంత్రిని కోరారు.

దీనిపై మంత్రి విశ్వరూప్ స్పందిస్తూ.. లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు. కోవిడ్‌తో వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల సీఎం జగన్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అయినా జగన్‌ సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు. ఏడాదిలో ఒకసారైనా ముఖ్యమంత్రి జగన్ వద్ద లారీ యజమానుల సంఘం నేతలతో సమావేశం ఏర్పాటుకు ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. సీఎం జగన్‌తో చర్చించి లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.