యాప్నగరం

అమరావతి ఒక కుల రాజధాని.. చంద్రబాబు తమాషాలు చేస్తే.. మంత్రి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి అప్పలరాజు సీరియస్ కామెంట్స్ చేశారు. రైతుల పాదయాత్ర పేరుతో విశాఖపట్నంపై దండయాత్రకు వస్తున్నారా అని ప్రశ్నించారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 9 Sep 2022, 5:27 pm
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర కామెంట్స్ చేశారు. రైతుల పాదయాత్ర పేరుతో తెలుగు దేశం పార్టీ నాయకులే అమరావతి నుంచి అరసవల్లి వరకు యాత్ర చేపట్టారని ఆరోపించారు. ఒక సామాజిక వర్గం వారే ఈ పాదయాత్రను తలపెట్టారని.. గతంలో కూడా తిరుపతి యాత్రలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించారని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్ర విశాఖపట్నంపై దండయాత్ర కోసమేనా అని మంత్రి అప్పలరాజు సూటిగా ప్రశ్నించారు.
Samayam Telugu మంత్రి అప్పలరాజు (ఫైల్ ఫొటో)


వాళ్లది అమరావతి యాత్రనా.. లేదా విశాఖపట్నంపై దౌర్జన్య యాత్రనా అని మంత్రి అప్పలరాజు నిలదీశారు. చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.. రైతులను ఉసిగొల్పుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పాదయాత్ర పేరిట ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తే ఖబడ్దార్.. అంటూ మంత్రి అప్పలరాజు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహావేశాలను విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో చంద్రబాబు ఒకసారి రుచిచూశారని.. ఉత్తరాంధ్ర ఎప్పటికీ వెనుకబడే ఉండాలన్నది ఆయన ఉద్దేశమా అని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్రను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తానంటే.. చంద్రబాబుకు బాధ ఎందుకంటూ మంత్రి అప్పలరాజు చురకలంటించారు. రాజధాని భూముల్లో పేదలకు ఇళ్లు పంపిణీ చేయవద్దని కోర్టుకు వెళ్లారని.. అక్కడ, కేవలం చంద్రబాబు సామాజిక వర్గం వారే ఇళ్లు కట్టుకోవాలని భావిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతి ప్రజా రాజధాని కాదని.. కేవలం ఒక కుల రాజధాని అని వ్యాఖ్యానించారు. తన కులం కోసం మాత్రమే చంద్రబాబు రాజధానిగా అమరావతిని ప్రకటించారన్నారు. ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల గడ్డ అని.. చంద్రబాబు తమాషాలు చేస్తుంటే.. చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.