యాప్నగరం

చెరువులో శవమై తేలిన టెన్త్ విద్యార్థిని.. కర్నూలు జిల్లాలో విషాదం

మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన పదో తరగతి విద్యార్థిని విగతజీవిగా కనిపించింది. బాలిక శవాన్ని స్థానిక చెరువులో గుర్తించారు. స్కూల్‌కి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన విద్యార్థిని శవమై తేలడం మిస్టరీగా మారింది.

Samayam Telugu 19 Dec 2019, 3:49 pm
కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మూడు రోజుల కిందట అదృశ్యమైన బాలిక చెరువులో శవమై తేలింది. బడికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన విద్యార్థిని మూడు రోజుల తరువాత విగతజీవిగా కనిపించడం తీవ్రంగా కలచివేస్తోంది. కనిపించకుండా పోయిన తమ కూతురు శవంగా తిరిగిరావడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Samayam Telugu death.


ఎమ్మిగనూరు రవీంద్రభారతి హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న నిహారిక మూడు రోజుల కిందట అదృశ్యమైంది. పాఠశాలకు వెళ్లి వస్తానని చెప్పిన కూతురు కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అసలు ఆ రోజు పాఠశాలకు రాలేదని తెలియడంతో గాలింపు చర్యలు చేపట్టారు. తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: భార్య, కోడలితో వ్యభిచారం చేయించైనా.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ లెటర్

అయితే కనిపించకుండా పోయిన నిహారిక ఎమ్మిగనూరులోని గుడెకల్ చెరువులో గురువారం శవమై కనిపించింది. ఎల్‌ఎస్పీ కెనాల్ గట్టుపై నిహారిక సైకిల్, బుక్స్ లభ్యమయ్యాయి. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అదృశ్యమైన బాలిక శవమై కనిపించడం మిస్టరీగా మారింది. విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా? లేక హత్య చేసి పడేసి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: నెల్లూరులో కీచక డాక్టర్.. కోరిక తీర్చాలంటూ వేధింపులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.