యాప్నగరం

రోజా వార్డ్ వాక్.. వైసీపీ ఎమ్మెల్యేలకు భిన్నంగా, జగన్ మెచ్చేలా

నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన ఎమ్మెల్యే రోజా. నగరి మున్సిపాలిటీలో వార్డ్ వాక్ పేరుతో వినూత్న కార్యక్రమం. ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ.. అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్న రోజా.

Samayam Telugu 4 Nov 2019, 9:43 am
అటు నగరి ఎమ్మెల్యేగా.. ఇటు ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ఛైర్మన్ రోజా బిజీ అయ్యారు. ఓవపై రాష్ట్రానికి సంబంధించిన ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవి బాధ్యతలు చూసుకుంటూనే.. ఇటు నియోజకవర్గానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. వారంలో నాలుగైదు రోజులు నియోజకవర్గానికే కేటాయిస్తున్నారు నగరి ఎమ్మెల్యే. ప్రజల, గ్రామాల్లో ఉన్న సమస్యల్ని తెలుసుకుంటూ.. వాటి పరిష్కారంపై ఫోకస్ పెడుతున్నారు. ఇటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.
Samayam Telugu roja


నగరి నియోజకవర్గంలో వార్డ్ వాక్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రోజా. నగరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వార్డుల్లో ఎమ్మెల్యే రోజానే స్వయంగా పర్యటిస్తున్నారు. స్థానికుల్ని అడిగి సమస్యల్ని తెలుసుకుంటున్నారు.. వాటిని పరిష్కరించేందుకు అధికారులకు సూచనలు చేస్తున్నారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. సీసీ రోడ్లతో పాటూ వాటర్ ట్యాంకుల్ని ప్రారంభించారు. డెంగ్యూ, వైరల్ వ్యాధుల నివారణకు పాగింగ్ మిషన్లను అందించారు.
రోజా కూడా నగరి మున్సిపాలిటీపై ప్రత్యేకంగా శ్రద్ద పెట్టారు.. దీనికి కారణం లేకపోలేదు. ఏపీ ప్రభుత్వం త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమయ్యింది. దీంతో రోజా నగరిలోని వార్డుల్లో సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వెంటనే పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. గత వారం రోజులుగా నగరిలో పర్యటిస్తున్నారు రోజా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.