యాప్నగరం

అలా చేస్తే బియ్యం ఫ్రీ.. నగరిలో ఎమ్మెల్యే రోజా బంపరాఫర్

నగరి నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే రోజా. కిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఇస్తే.. కిలో బియ్యం పట్టుకెళ్లండి అంటూ బంపరాఫర్. స్వచ్ఛ్ నగరి తన లక్ష్యమంటున్న ఎమ్మెల్యే.

Samayam Telugu 16 Nov 2019, 11:29 am
ఇటు నగరి ఎమ్మెల్యేగా.. ఇటు ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ఛైర్మన్ రోజా బిజీ అయ్యారు. ఓవపై రాష్ట్రానికి సంబంధించిన ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవి బాధ్యతలు చూసుకుంటూనే.. ఇటు నియోజకవర్గానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. వారంలో నాలుగైదు రోజులు నియోజకవర్గానికే కేటాయిస్తున్నారు నగరి ఎమ్మెల్యే. ప్రజల, గ్రామాల్లో ఉన్న సమస్యల్ని తెలుసుకుంటూ.. వాటి పరిష్కారంపై ఫోకస్ పెడుతున్నారు. ఇటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.
Samayam Telugu roja


Read Also: Chandrababu Naidu ఆ పని చేస్తానంటే మేం ఆపలేదుగా: విజయసాయిరెడ్డి

తాజాగా తన నియోజకవర్గంలో స్వచ్చ్ నగరి పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రోజా. పర్యావరణ పరిరక్షణకు, ప్లాస్టిక్‌ను నిరోధించేందుకు ఎమ్మెల్యే రోజా వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. మునిసిపాలిటీలోని వార్డును , పంచాయతీలోని గ్రామాల్లోని హానికర ప్లాస్టిక్ ను ఎరివేయండి అంటూ పిలుపునిచ్చారు. కిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఇస్తే.. కిలో బియ్యం పట్టుకెళ్లండి అంటూ బంపరాఫర్ ప్రకటించారు.

ఈ ప్రయత్నం 'మనకోసం మన ఎమ్మెల్యే గారు చేపట్టే మంచి కార్యక్రమం ఇందులో భాగస్వామ్యులవుదం నగరిని హానికర ప్లాస్టిక్ వ్యర్ధాలు లేని స్వచ్చ్ నగరిగా మారుద్దాం' అంటూ పిలుపునిచ్చారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.. అందరికీ ఆదర్శంగా నిలుద్ధాం అంటున్నారు. కిలో ప్లాస్టిక్ ఇస్తే చాలు.. కిలో బియ్య ఇస్తామని ప్రకటించారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయాన్ని రోజా పోస్ట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.