యాప్నగరం

తిరుపతి నుంచి తిరుమలకు రైలు!

తిరుమలకు రైలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్న టీటీడీ. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో సంప్రదింపులు.. త్వరలోనే నివేదిక వస్తుందని.. తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నటీటీడీ ఛైర్మన్.

Samayam Telugu 23 Feb 2020, 4:39 pm
తిరుపతి నుంచి తిరుమలకు రైలు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది టీటీడీ. మోనో రైలు, లైట్ మెట్రోలను పరిశీలిస్తున్నామని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండేలా చూడాలని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో చర్చించామని.. దీనిపై నివేదిక ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత.. ఈ రైలు అంశంపై అవసరమైతే ఆగమపండితులతో చర్చిస్తామన్నారు.
Samayam Telugu ttd


Read Also: వెంకన్న డబ్బు జగన్ సర్కార్‌ ట్రెజరీకి.. టీటీడీ క్లారిటీ

ఏడుకొండల్లో ఎలాంటి టన్నెల్ తవ్వకుండా ఉన్న మార్గాల్లోనే మోనో రైలు అవకాశాలు పరిశీలించాలని అడిగాము అంటున్నారు సుబ్బారెడ్డి. తిరుమలలో రోడ్డుపై వెళ్లే మోనో, ట్రామ్‌ రైల్‌ తరహా వాటిని మాత్రమే పరిశీలిస్తున్నామంటున్నారు. ప్రధానంగా మోనో రైలు అవకాశాలను పరిశీలిస్తున్నామని.. రోప్‌వేలో కేబుల్ కార్లు వంటివి వద్దని చెప్పామంటున్నారు టీటీడీ ఛైర్మన్.

రెండు నడక మార్గాలు, రెండు ఘాట్ రోడ్లలోనే.. మోనో రూలు వేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ చెప్పుకొచ్చారు. పర్యావరణ పరిరక్షణకు రైలు ప్రతిపాదన ఉపయోగపడుతుందని.. ఆస్ట్రియాలో ఎత్తైన కొండపైకి మోనో రైలు వెళ్తోందని.. అదే మోడల్‌గా తీసుకుని తిరుమలకు రైలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామంటున్నారు. ఇటీవల హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చర్చలు జరిపారు. తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు ప్రతిపాదనలపై చర్చించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.