యాప్నగరం

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం

తాను ఉద్యమంలోనికి రావడానికి చంద్రబాబు కారణమని.. ఉద్యమంతో ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా నష్టపోయాను అన్నారు పద్మనాభం. మేధావులతో కలిసి ఉద్యమాన్ని నడిపానని.. బంతిని కేంద్రం కోర్టులో వేశాననడం బాధించింది అన్నారు.

Samayam Telugu 13 Jul 2020, 11:40 am
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.. ఈ క్రమంలో కాపులకు ఆయన ఓ లేఖ రాశారు. సోషల్ మీడియాలో తనపై దాడులు చేస్తున్నారని.. తనను కుల ద్రోహి అంటూ విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖలో తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.. పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
Samayam Telugu ముద్రగడ పద్మనాభం


తాను ఉద్యమంలోనికి రావడానికి చంద్రబాబు కారణమని.. ఉద్యమంతో ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా నష్టపోయాను అన్నారు పద్మనాభం. మేధావులతో కలిసి ఉద్యమాన్ని నడిపానని.. బంతిని కేంద్రం కోర్టులో వేశాననడం బాధించింది అన్నారు. సందర్భాన్ని బట్టి ఉద్యమం రూపు మారుతుంటుందని.. కాపు జాతికి మేలు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను అన్నారు.

ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూ రిజర్వేషన్ ఇచ్చేయడం వల్ల నేను గొప్పవాడినికి అయిపోతానని మీరు అభిప్రాయపడవచ్చు అన్నారు. దయచేసి మీ ఫీసులో పనిచేసే వారి పేరు మీద లేఖ తీసుకుని, పనిచేసి ఆ పేరు ప్రతిష్టలు పొందండి.. ఫలితాన్ని ఆశించే మనిషిని కాను అని ఆనాడే చెప్పడం జరిగింది అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.