యాప్నగరం

జగన్ సర్కార్‌కు మరో సలహాదారు నియామకం.. నాగార్జున రెడ్డికి పదవి

Pothireddy Nagarjuna Reddy ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన రెండేళ్ల పాటూ ఈ పదవిలో కొనసాగనున్నారు. కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన నాగార్జున రెడ్డి. గతంలో ఎంపీపీగా, జెడ్పీటీసీగా పనిచేశారు. అంతేకాటు టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా నియమించారు. కానీ హైకోర్టు ఉత్తర్వులతో ఆ పదవి దక్కలేదు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 29 Nov 2022, 5:38 am

ప్రధానాంశాలు:

  • ఏపీ ప్రభుత్వానికి మరో సలాహాదారుడు
  • పోతిరెడ్డి నాగార్జునరెడ్డికి కొత్తగా పదవి
  • రెండేళ్ల పాటూ కొనసాగనున్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nagarjuna Reddy Pothireddy
ఏపీ ప్రభుత్వంలో మరో సలహాదారుడి నియామకం జరిగింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సలహాదారుడిగా పోతిరెడ్డి నాగార్జునరెడ్డి (Nagarjuna Reddy Pothireddy)ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొత్త నియామకంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన పోతిరెడ్డి నాగార్జున రెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన గతంలో ఎంపీపీగా, జెడ్పీటీసీగా ఉన్నారు. అంతేకాదు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి తల్లి కృష్ణమ్మ రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్‌గా వ్యవహరించారు. అంతేకాదు ఆయన గతంలో టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం.. అలాగే ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని తప్పుబట్టి ప్రభుత్వం జారీ చేసిన 568, 569 జీవోలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది.

గతవారం కూడా ప్రభుత్వం మరో సలహాదారును నియమించిన సంగతి తెలిసిందే. నారమల్లి పద్మజ (Naramalli Padmaja)ను స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. ఈ మేరకు ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఏఆర్‌ అనురాధ పేరిట ఆ జీవో విడుదల చేశారు. పద్మజ వైఎస్సార్‌సీపీ నేతగా ఉన్నారు. పద్మజ 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని ఓ స్థానం నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. ఆమె పార్టీలోనే కొనసాగుతున్నారు.. ఇప్పుడు నామినేటెడ్ పదవి దక్కింది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.