యాప్నగరం

నారా లోకేష్, వంగవీటి రాధా భేటీ.. తేల్చి చెప్పేశారా, చర్చించిన అంశాలివేనా?

Vangaveeti Radha Nara Lokesh Meet అయ్యారు. దాదాపు గంటసేపు భేటీ కొనసాగగా.. కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాధా పార్టీ మారతారనే ఊహాగానాల సమయంలో లోకేష్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు రాధా వారంలో రెండుసార్లు పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. దీంతో పార్టీ మారతారనే ఊహాగానాలకు పుల్‌స్టాప్ పడిందనే చర్చ జరుగుతోంది. లోకేష్ రాధాకు ఏదైనా హామీ ఇచ్చారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద రాధా, లోకేష్‌ల భేటీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 8 Mar 2023, 9:15 am

ప్రధానాంశాలు:

  • వంగవీటి రాధా, నారా లోకేష్‌ల భేటీ
  • కీలక అంశాలపై చర్చించిన నేతలు
  • పార్టీ మార్పు ప్రచారానికి పుల్ స్టాప్!
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vangaveeti Radha Lokesh Meet
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా (Vangaveeti Radha ) నారా లోకేష్‌ పాదయాత్ర (Nara Lokesh Padayatra)లో పాల్గొన్నారు. ఇద్దరు కలిసి కొంతదూరం నడిచారు.. అనంతరం ఇద్దరు గంటసేపు క్యారవేన్‌‌లో సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటూ కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాధా సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసే చేయాలని భావిస్తున్నారట.. అయితే ఇప్పటికే అక్కడ టీడీపీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఉమా పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.. ఆయనకు టికెట్ ఖాయమనే ధీమాతో ఉన్నారు.
ఉమా అంశంపై రాధాతో చర్చించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని.. కచ్చితంగా తగిన ప్రాధాన్యం ఇస్తామని రాధాకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత.. క్యారవేన్ నుంచి రాధా నవ్వుతూ బయటకు వచ్చారు. తాను ఇక నుంచి వారానికి రెండు సార్లు యువగళంలో పాల్గొంటానని రాధా చెప్పారు. కొద్దిరోజులుగా రాధా పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరిగింది.. అయితే ఇంతలో లోకేష్‌ను కలవడం చర్చనీయాంశమైంది.

వంగవీటి రాధా 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యంలో చేరి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరిన రాధా.. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేయగా ఓటమి ఎదురైంది. 2019 ఎన్నికల సమయంలో రాధా టీడీపీ కండువా కప్పుకున్నారు. పోటీకి దూరంగా ఉన్న రాధా.. టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు.

2019 ఎన్నికల ఫలితాల తర్వాత రాధా రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ కావడంతో టీడీపీని వీడతారని ప్రచారం జరిగింది. రాధా జిల్లాల్లో కొన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు.. అలాగే అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా సభల్లో పాల్గొన్నారు. రాధా టీడీపీలోనే ఉన్నా సరే.. పార్టీ సమావేశాలు, కార్యక్రమాలకు వెళ్లడం లేదు.

అంతేకాదు ఇటీవల ఆయన నివాసం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లి రాధాను పరామర్శించారు. ఆ తర్వాత వంగవీటి రాధా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అది కూడా రంగా విగ్రహం ఆవిష్కరణకు ఇద్దరితో కలిసి హాజరయ్యారు. కొద్ది రోజులుగా పార్టీ మారతారని మళ్లీ ప్రచారం జరుగుతోంది. ఇంతలో లోకేష్‌ను కలిశారు. మరి రాధా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నదిఆసక్తికరంగా మారింది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.