యాప్నగరం

'అప్పుడు కడతామన్నారు, ఇప్పుడు కొడతామంటున్నారు.. ఇదేంటి జగన్ గారూ'

'అప్పుడేమో ఫీజులు ఇస్తాం చదువుకోమని చెప్పారు.. ఇప్పుడేమో ఫీజులు ఇవ్వమని అడిగితే పోలీసులతో కొట్టిస్తున్నారు. మాటలు చెప్పడం కాదండీ.. చేసి చూపించండి' అంటున్న నారా లోకేష్.

Samayam Telugu 23 Aug 2019, 6:02 pm
ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారంపై ఏపీలో రగడ మొదలయ్యింది. విజయనగరంలో విద్యార్థులపై లాఠీఛార్జ్‌పై టీడీపీ వైసీపీ సర్కార్‌ను టార్గెట్ చేసింది. ఫీజులు చెల్లించమని అడిగితే అన్యాయంగా విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారంటూ ప్రతిపక్షం మండిపడుతోంది. ఈ ఘటనపై చంద్రబాబు ఇప్పటికే స్పందించగా.. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్‌లో జగన్‌ సర్కార్‌ను టార్గెట్ చేశారు.
Samayam Telugu jagan.


Read Also: సీఎం జగన్ గారూ.. ఫీజులు చెల్లించమంటే విద్యార్థుల్ని లాఠీలతో కొడతారా'

‘మీరు చదువుకోండి ఫీజులు మేము 'కడతాం' అని ప్రచారం చేసుకున్న జగన్ గారు ఇప్పుడు ఫీజులు అడిగితే 'కొడతాం' అంటున్నారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్సుమెంటు బకాయిలను చెల్లించమంటూ మూడు గంటలు మండుటెండలో నిరసన చేసినా విద్యార్థుల సమస్యలు వినే తీరిక ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందని’లోకేష్ విమర్శించారు.
‘శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులను లాఠీలతో చావబాదుతారా? గిరిజన సంక్షేమగృహాల్లో వసతులు పెంచమని కోరడమే తప్పా? ప్రభుత్వానికి గిరిజన సంక్షేమం మీద ఉన్న శ్రద్ధ ఇదేనా? జగన్ గారూ.. మాటలు చెప్పడం కాదు, చేసి చూపండి. వెంటనే రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు తీర్చండి’అన్నారు. చివర్లో #YSJaganFailedCM అంటూ హ్యాష్ ట్యాగ్ ట్వీట్ చేశారు.
ఇటు చంద్రబాబు కూడా ఈ ఘటనపై స్పందించారు. చదువుకుంటాం ఫీజులు ఇవ్వండి, ఉపకారవేతనాలు ఇవ్వండి అని అడగడం తప్ప, ఏం తప్పుచేసారని విద్యార్థులని లాఠీలతో కొట్టించారు? వీళ్ళేమీ లక్షల కోట్లు దోచుకున్న దొంగలు కాదే!. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై జులుం ప్రదర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది? వారి సమస్యలను పరిష్కరిస్తామన్న భరోసాను ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? విద్యార్థులంటే అంత చులకనా? విద్యార్థుల సమస్యలని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది తెలుగుదేశం’అంటూ మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.