యాప్నగరం

'మేమూ అలా చేసుంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవారా'

టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనలో ఉద్రిక్తతపై మాజీ మంత్రి నారాా లోకేష్ స్పందన. వైఎస్సార్‌సీపీ కుట్రలు చేసిందని ఆరోపించిన మాజీ మంత్రి. ఇంత పరికితనమా అంటూ ప్రశ్న.

Samayam Telugu 28 Nov 2019, 3:35 pm
అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో హైవోల్టేజ్ టెన్షన్ కనిపించింది. రెండు వర్గాలుగా విడిపోయిన రైతులు పోటా-పోటీగా నిరసనలకు దిగడంతో టెన్షన్ వాతావరణం కనిపించింది. చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, కర్రలు, రాళ్లు విసరడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల రంగప్రవేశంతో రెండు వర్గాలను చెదరగొట్టారు. ఇలా రాజధాని ప్రాంతంలో మొదలైన రగడ తర్వాత.. వైఎస్సార్‌సీపీ వర్సెస్ టీడీపీలా మారింది.. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తోంది.
Samayam Telugu lokesh


Read Also: అమరావతిలో బాబు పర్యటన.. హైవోల్టేజ్ నిరసనలు.. ఈస్థాయిలో వ్యతిరేకత ఎందుకు?

చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి ఘటనను మాజీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా దాడి చేయించారని ఆరోపించారు. చంద్రబాబు అమరావతి పర్యటనలో వైసీపీ కుట్రలు బయట పడతాయన్న భయంతో కాన్వాయిపై మీ పార్టీ గూండాలను రప్పించి దాడులు చేయిస్తారా అంటూ మండిపడ్డారు. మరీ ఇంత పిరికితనమా.. టీడీపీ హయాంలో తాము కూడా ఇలా చేస్తే జగన్ గారు పాదయాత్ర చేయగలిగేవారా అంటూ ప్రశ్నించారు.
ఇటు టీడీపీ-వైఎస్సార్‌సీపీ నేతల మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబు టూర్‌పై ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో.. టీడీపీ పాలన ఐదేళ్లలో ఒక్క శాశ్వత భవనం కూడా కట్టని చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని పర్యటిస్తారని ప్రశ్నించారు నేతలు. అమరావతిలో నిర్మాణాలు చేపట్టామని టీడీపీ చెబుతోందని.. వారితో కలిసి వెళ్లి పరిశీలించడానికి తాము సిద్ధమని.. ఐదేళ్లలో టీడీపీ కట్టిన భవనాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఐదేళ్లలో అమరావతిని అభివృద్ధిని పట్టించుకోని బాబు ఇప్పుడెలా పర్యటనకు వచ్చారని ప్రశ్నించారు.

Also Read: 'చంద్రబాబు రాజధాని పర్యటన అందుకే'

జగన్ సర్కార్ తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కొత్త ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేస్తోందని.. ప్రజలకు దీనిని వివరించేందుకు చంద్రబాబు పర్యటనకు వెళ్లారంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలల అవుతున్నా రాజధానిని పట్టించుకోలేదని ఆరోపించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ అడుగడుగునా ప్రయత్నిస్తోందని.. రాష్ట్ర ప్రజలు దీనిని గమనిస్తున్నారని మర్చిపోకూడదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.