యాప్నగరం

విశాఖ పరవాడ అగ్నిప్రమాదం.. ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించిన నారా లోకేష్

విశాఖలో తాజాగా జరిగిన పరవాడ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంపై నారా లోకేష్ స్పందించారు. ఈ ఘటనపై ప్రభుత్వంపై పలు ప్రశ్నలు కురిపించారు. ఇప్పుడు మంత్రులు, సీఎం ఏం చెబుతారంటూ నిలదీశారు.

Samayam Telugu 14 Jul 2020, 12:50 pm
విశాఖ రాంకీ ఫార్మా సిటీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రతిపక్షలు భగ్గమంటున్నాయి. ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన సీనియర్ కెమిస్ట్ శ్రీనివాసరావు మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. విశాఖలో వరుస ప్రమాద ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తరువాత అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని గతంలో ప్రభుత్వం చెప్పిందని... గుర్తు చేశారు.
Samayam Telugu నాారా లోకేష్, జగన్
jagan lokesh


ఇకపై ప్రమాదలు జరగవు అని ప్రభుత్వం, మంత్రులు ప్రకటనలు చేశారన్న విషయాన్ని ఈ సందర్భంగా లోకేష్ గుర్తు చేశారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం తరువాత జరిగిన సాయినార్ కెమికల్స్, ఇప్పుడు జరిగిన రాంకీ ప్రమాదాలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నారా లోకేష్ ప్రశ్నించారు. రాంకీ ఎస్ఈజెడ్ లో 15 రోజుల వ్యవధిలోనే రెండు ప్రమాదాలు జరిగాయని...ఈ ఘటన పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ ట్వీట్ చేస్తూ డిమాండ్ చేశారు.
Read More: విశాఖ పరవాడ ప్రమాదంలో ఒకరు మృతి.. శిథిలాల కింద మృతదేహం
మరోవైపు విశాఖ పరవాడలోని రాంకీ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. నిన్న రాత్రి సమయంలో ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. సాల్వెంట్స్‌ ఫార్మా కంపెనీలోని ట్యాంకు పేలి మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనలో కాండ్రేగుల శ్రీనివాస్‌ (40) ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. సాల్వెంట్స్‌ ఫార్మా కంపెనీలో శ్రీణివాస్‌ సీనియర్‌ కెమిస్ట్‌ పని చేస్తున్నారు. ప్రమాద సమయంలో కంపెనీలో నలుగురు సిబ్బంది ఉన్నారు. తీవ్రంగా గాయపడిన కార్మికుడు మల్లేశ్వరరావును గాజువాక ఆసుపత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.