యాప్నగరం

జగన్ గారూ.. చిరు కంటే మీకే అభిమానులు ఎక్కువ: వైసీపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

జగనన్న పేరుతో సుమారు 20 కార్యక్రమాలుఉన్నాయని గుర్తు చేశారు. జగన్ పేరుతో కరోనాపై పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో జగన్‌ పేరు ఉంటేనే ప్రజల్లో, అధికారుల్లో సీరియస్ నెస్ ఉంటుందన్నారు.

Samayam Telugu 27 Jul 2020, 2:58 pm
ఏపీలో కరోనా నియంత్రణ చర్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. జగన్ సర్కార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని.. జగనన్న పేరుతో సుమారు 20 కార్యక్రమాలు ఉన్నాయని గుర్తు చేశారు. జగన్ పేరుతో కరోనాపై పోరాటం చేయాలన్నారు.. పేరు ఏదైనా ప్రజలకు ప్రయోజనం చేకూరడం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమాల్లో జగన్‌ పేరు ఉంటేనే ప్రజల్లో, అధికారుల్లో సీరియస్ నెస్ ఉంటుందన్నారు. జగన్ కరోనా కేర్ అనో.. జగనన్న కరోనా వార్ అనో ఏదైనా పేరు పెడితే బాగుంటుందన్నారు.
Samayam Telugu జగన్, చిరు (File)


మెగాస్టార్ చిరంజీవి మాస్కు పెట్టుకోవాలంటూ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారని రఘురామ గుర్తు చేశారు. ఆయన కంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్న సీఎం జగన్ ఓ మంచి కార్యక్రమం చేపడితే బావుంటుందన్నారు. ఓ చక్కని చిత్రం చేసి.. ప్రజలకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర ఆరోగ్య సెక్రటరీ రాజేష్ భూషణ్‌ని కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించానని.. 15వ స్థానంలో ఉన్న ఏపీ.. కోవిడ్ కేసుల్లో 3వ స్ధానంలోకి వెళ్లిందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యమంత్రితో సమావేశమవుతానని చెప్పుకొచ్చారు.

కొన్ని జిల్లాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటున్నారని.. మాస్క్ లేకుండా బయట తిరుగుతున్నారని రఘురామ చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ జరుగుతుందని.. ప్రభుత్వం జోక్యం చేసుకుని అరికట్టాలన్నారు. 24 గంటల్లో రిపోర్ట్స్ వచ్చేలా కరోనా టెస్టు నిర్వహిస్తే సామాజిక వ్యాప్తి అరికట్ట వచ్చని సలహా ఇచ్చారు. కరోనాతో సహజీవనం చేయాలని కాకుండా.. మండలస్థాయిలో కమిటీలు వేసి, వాటిల్లో డాక్టర్లను, నిపుణులను తీసుకోవాలన్నారు.

ఇక పశ్చిమగోదావరి జిల్లాలో చెత్త వేసే మున్సిపాలిటి బండిలో కరోనా బాధితుడిని తీసుకు వెళ్లడం బాధాకరమన్నారు ఎంపీ. ఈ ఘటనపై సిగ్గుతో తలదించుకుంటున్నానని.. తన సొంతూళ్లో జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన అంబులెన్స్‌లు ఉపయోగపడటం లేదన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి వెళ్ళాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.