యాప్నగరం

కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎంపీ

వైఎస్సార్‌సీపీని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ప్రాధేయపడగా.. బీజేపీ సానుకూలంగా స్పందించినట్లు వార్తలు. ఆ విషయాన్ని ప్రస్తావించిన ఆ పార్టీ ఎంపీ.

Samayam Telugu 26 Sep 2020, 8:07 am
కేంద్ర కేబినెట్‌లోకి వైఎస్సార్‌సీపీ.. మరోసారి తెరపైకి చర్చ వచ్చింది. ఆ పార్టీ మోదీ సర్కార్‌లోకి చేరబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రస్తావించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో.. తమ పార్టీని కేబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం జగన్‌ ప్రాధేయపడగా.. బీజేపీ సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయన్నారు. కానీ వైఎస్సార్‌సీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అవకాశం రాదన్నారు. హిందువుల పరిరక్షణలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బీజేపీ..వారి మనోభావాలను దెబ్బతీస్తున్న ఆ పార్టీకి అవకాశం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.
Samayam Telugu వైసీపీ


Read Also: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్

వైఎస్సార్‌సీపీ పాలనలో ఒక పథకం ప్రకారం హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు రఘురామ. ఈ సమయంలో ఆ పార్టీని బీజేపీ ఎలా అక్కున చేర్చుకొని.. కేంద్ర మంత్రిమండలిలోకి తీసుకుంటుంది అన్నారు. కేబినెట్‌లోకి వైఎస్సార్‌సీపీని తీసుకోకూడదనే తన ఆలోచన అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎంలను ఏపీ మంత్రులు దూషించారన్నారు. న్యాయవ్యవస్థలపై పార్లమెంటులోనే దాడులకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు తెగబడ్డారని మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్న తన మామని పరామర్శించిన జగన్‌.. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ చనిపోతే పట్టించుకోరా అని ప్రశ్నించారు.

Also Read: గ్రామ-వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌Must Read: ఏపీలో ఆన్‌లైన్ రమ్మీ ,పేకాట ఆడారో జైలుకు.. ఆన్‌లైన్‌ గేమింగ్‌ చట్టంలో సవరణలు, ఆర్డినెన్స్‌ జారీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.