యాప్నగరం

టీడీపీలో విషాదం.. కరోనా సోకి నెల్లూరు పార్టీ నేత మృతి

నెల్లూరుకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త టీడీపీ నేత కరోనాతో మృతి చెందారు. దీంతో టీడీపీకి చెందిన ప్రముఖ నేతలంతా ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.

Samayam Telugu 12 Jul 2020, 4:40 pm
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ కరోనా బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా 19 మంది మరణించారు. ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కరోనా బారిన పడి ప్రముఖ వ్యాపార వేత్త, టీడీపీ నేత పి. టి రంగరాజన్ మృతి చెందారు. దీంతో ఆయన మృతికి పలువురు నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవిచంద్ర సంతాపం తెలిపారు. రంగరాజన్ కుటుంబానికి నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. టీడీపీకి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రంగరాజన్ రాజకీయాలతో పాటు వ్యాపారరంగాల్లో రాణించారని నేతలు చెప్పారు.
Samayam Telugu కరోనాతో టీడీపీ నేత మృతి
tdp leader dies with corona

Read More: ఏపీలో కరోనా విశ్వరూపం.. కేసుల్లో రికార్డు బ్రేక్.. 24 గంటల్లో 19 మంది మృతి
ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,933 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 1,914 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 18 మంది ఉన్నారు. ఇక విదేశాల నుంచి వచ్చినవారు ఒకరు ఉన్నారు. కేసులతో పాటు మరణాలు కూడా ఏపీని భయపెడుతున్నాయి. గత 24 గంటల్లో 19 మంది మృతి చెందారు. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు మృతి చెందారు. కృష్ణా, విశాఖ జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు, నెల్లూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.

నిన్నమొన్నటివరకు పట్టణాల వరకే పరిమితమైన వైరస్ ఇప్పుడు గ్రామాల్ని సైతం వణికిస్తోంది. పల్లెల్లో కూడా అక్కడక్కడ కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక గ్రామాలు సొంతంగా లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావడం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.