యాప్నగరం

గాంధీ విగ్రహానికి వైఎస్సార్సీపీ రంగులు.. తప్పుడు ప్రచారం, నీచ రాజకీయం!

ఏపీలో ప్రస్తుతం రంగుల రాజకీయం నడుస్తోంది. ప్రతి నిర్మాణానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి వైఎస్సార్సీపీ రంగులు వేసినట్టు వార్తలొచ్చాయి. మెరకముడిదాం మండలం భైరిపురం పంచాయతీ కార్యాలయంలో మాజీ సర్పంచ్ తన తల్లి జ్ఞాపకార్థం గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఉన్న దిమ్మెకు వైఎస్సార్‌సీపీ జెండా రంగులు వేయించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Samayam Telugu 22 Nov 2019, 4:35 pm

Samayam Telugu not painted party colours to mahatma gandhi staute says ysrcp and reveals real photo
గాంధీ విగ్రహానికి వైఎస్సార్సీపీ రంగులు.. తప్పుడు ప్రచారం, నీచ రాజకీయం!

అధికార పార్టీపై బాబు, పవన్ ఫైర్

ఈ ఫొటోను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ తీరుపై వారు విమర్శలు గుప్పించారు. త్రివర్ణ పతాకానికి తమ పార్టీ రంగులేసుకొని అభాసులపాలైన వైఎస్సార్సీపీ పాఠాలు నేర్వలేదని బాబు మండిపడగా.. మొన్న జాతీయ జెండా, ఈరోజు గాంధీ విగ్రహం, రేపేంటి జగన్ రెడ్డీ జీ? అని పవన్ ప్రశ్నించారు.

వైఎస్ఆర్సీపీ స్పందన ఇదీ..

కాగా, గాంధీ విగ్రహ దిమ్మెకు తమ పార్టీ రంగులేసినట్టు వస్తోన్న ప్రచారం తప్పని వైఎస్ఆర్సీపీ చెబుతోంది. ఇందుకు ఆధారంగా.. గాంధీ విగ్రహం ఫొటోలు, వీడియోలను విడుదల చేసింది. వీటిల్లో గాంధీ విగ్రహాన్ని ఉంచిన దిమ్మెకు తెల్ల రంగు మాత్రమే వేసి ఉంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫేక్ ఫొటోలను ట్వీట్ చేశారని తెలిపింది.

Twitter-అధికారం కోల్పోవ‌డాన్ని ప‌చ్చ‌పార్టీ నేత‌లు జీర్ణిం...

Twitter-వైసీపీ రంగులతో మొన్న జాతీయ జెండా , ఈ రోజు గాంధీజీ,...

Twitter-The inconsistency in images and writings shows, ho...

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.