యాప్నగరం

కృష్ణా, గుంటూరులో రోడ్డు ప్రమాదాలు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

గమ్యాలు చేరుకుండానే వలస జీవుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.

Samayam Telugu 17 May 2020, 8:56 am
లాక్‌డౌన్ కారణంగా వలస జీవులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సొంతూళ్లకు వెళుతూ పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రోజూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వలస కూలీలు ప్రయాణిస్తున్న వాహానాలు ప్రమాదానికి గురై ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద ఆదివారం ఉదయం వలస కూలీలతో కోల్‌కతాకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, కొందరు గాయపడ్డారు. చెన్నై నుంచి వలస కూలీలతో కోల్‌కతాకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు గన్నవరం వెటర్నరీ కాలేజీ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. గాయపడినవారిని చికిత్స కోసం గన్నవరం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ తెలిపారు.
Samayam Telugu ఏపీ రోడ్డు ప్రమాదం


గుంటూరు జిల్లాలోనూ మరో ప్రమాదం సంభవించింది. యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద వలస కూలీలతో వెళుతున్న టెంపో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలు గాయపడ్డారు. వీరంతా చెన్నై నుంచి బీహార్‌కి వెళుతున్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం పది మంది వాహనంలో ఉన్నారని తెలిపారు. క్షతగాత్రులను వైద్యం కోసం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.