యాప్నగరం

గోదావరి బోటు: రంగంలోకి స్కూబా టీమ్.. బయటపడిన బోటు బోర్డు, పైభాగం!

Darmadi Satyam: బోటును వెలికితీసే పనుల్లో పురోగతి. స్కూబా టీమ్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్. బోటుపైభాగం, బోటు బోర్డును ఒడ్డుకు లాగేశారు. వర్షం అడ్డంకిగా మారడంతో పనులకు మధ్య, మధ్యలో అంతరాయం.

Samayam Telugu 21 Oct 2019, 5:16 pm
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు సమీపంలో గోదావరిలో మునిగిన బోటువెలికితీత పనులుకొనసాగుతున్నాయి. ఏడో రోజు ధర్మాడి సత్యం టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. సోమవారం మధ్యాహ్నానికి ఈ ప్రయత్నాల్లో పురోగతి వచ్చింది. కాకినాడ నుంచి వచ్చిన స్కూబా టీమ్ ఆధ్వర్యంలో.. నాలుగువైపులా లంగర్లు వేసి బోటు వెలికితీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బోటుపైభాగం, బోటు బోర్డు ఊడాయి.. వీటిని జేసీబీ సాయంతో ఒడ్డుకు లాగారు. మిగతా భాగాన్ని బయటకు తీసేందుకు క్రేన్ సాయంతో ప్రయత్నాలు చేస్తున్నారు.
Samayam Telugu boat.


Read Also: చిత్తూరు పరువు హత్య.. చందనను చంపింది తల్లిదండ్రులే

సోమవారం సాయంత్రానికి బోటును బయటకు తీస్తామని ధర్మాడి సత్యం టీమ్ చెబుతోంది. కానీ కచ్చులూరు సమీపంలో కురుస్తున్న వర్షం దెబ్బకు బోటు వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడుతోంది. ఆలస్యమైనా సరే బోటును ఒడ్డుకు చేర్చి తీరుతామని సత్యం టీమ్ చెబుతోంది. గోదావరి వరద ఉధృతికి బోటులోకి భారీగా ఇసుక చేరడంతోనే బయటకు లాగడం కష్టంగా మారిందంటున్నారు. డైవర్స్ సాయంతో లంగర్లు వేసి ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని చెబుతున్నారు.

ఆదివారం బోటును వెలికి తీయడం కోసం డీప్ వాటర్ డ్రైవర్స్ కచ్చలూరు చేరుకున్నారు. మెరైన్ కెప్టెన్ ఆదినారాయణ సహాయంతో డైవర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. నీటిలోకి దిగిన డైవర్లు ట్రయల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మొత్తం పది మంది డైవర్లలో ఇద్దరు నది అడుగు భాగంలోకి వెళ్లి పరిస్థితి గమనించారు. బోటు మునిగిన ప్రాంతంలో నదీ గర్భం "V" ఆకారం లో ఉందన్నారు. అనంతరం ఐరన్ రోప్ తీసుకుని బోట్‌ చుట్టూ కట్టేందుకు డైవర్లు మళ్లీ నీటిలోకి వెళ్లారు. జేసీబీ సాయంతో బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.