యాప్నగరం

‘గజ్జి బ్యాచ్‌కి చింపుల్ కొచ్చెన్‌.. *** పగిలింది..’ జనసైనికులపై పరకాల ప్రభాకర్ సంచలనం!

జనసేన కార్యకర్తలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 6 Aug 2021, 6:40 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ వర్సెస్ జనసైనికుల మధ్య వార్ నడుస్తోంది. ట్విట్టర్ వేదికగా జనసైనికుల్ని పరోక్షంగా టార్గెట్ చేస్తూ పరకాల ప్రభాకర్ ఓ రేంజ్‌లో ఫైరవుతున్నారు. అలాగే జనసైనికులు కూడా అంతే స్థాయిలో ఆయనపై విరుచుకుపడుతున్నారు. గత 3, 4 రోజులుగా జనసైనికులపై పరోక్షంగా ట్వీట్లు చేస్తున్నారు. పరకాల చేసిన ట్వీట్‌కు జన సైనికులు, మరికొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు.
Samayam Telugu పరకాల ప్రభాకర్


అలాగే పరకాల కామెంట్స్‌కు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా రియాక్ట్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు జనసైనికుల మధ్య వివాదం జరగగా, తాజాగా.. తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, సినీ దర్శకుడు సాయి రాజేష్ రియాక్ట్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం ట్విట్టర్‌లో తీవ్ర దుమారం రేపుతోంది.

ఇంకా ఆ మూలా, ఈ మూలా పిత్తపరిగి సైన్యం తచ్చాడుతున్న పిత్తపరిగి సైన్యం కోసమంటూ పరకాల ప్రభాకర్ పోస్ట్ చేశారు. గత మూడు రోజులుగా జనసైనికులు వరుస ప్రశ్నలు సంధించారు.


‘‘హెడ్ లైన్స్..
నిన్నటి చింపుల్ కొచ్చెన్‌కి కూడా జవాబు ఇవ్వలేకపోయిన గజ్జి బ్యాచ్! అసహనంతో ‘పూ’ గుణింతపు బూతుపురాణం లంకించుకున్న నేల టికెట్- ఈట బ్యాచ్! రోజురోజుకూ నీరసిస్తున్న పిత్తపరిగి సైన్యం! మొదటి రోజున 385, రెండో రోజు 325. ఇవాళ మూడో రోజు మరీ ఘోరంగా 154కి పడిపోయిన తిట్లు/ శాపనార్థాల ట్వీట్లు! వెనక కాళ్ల మధ్య తోకలు దోపుకుని పరుగులు తీస్తున్న గజ్జి కుక్కల బ్యాచ్! ఆఫీసులో ఇస్తున్న ‘ట్వీట్-కి- పావలా’ రేటు పట్ల ఈల బ్యాచ్ అసంతృప్తి!

పోనీ ఈవాళ ఇంకా వీజీ కొచ్చెన్ ఇస్తాను. ట్రై చెయ్యండి. రేపటికి రేటు ఏమైనా కిట్టుబాటు అవుతుందేమో చూడండి..
బీవారం గిలాసు
ఈ మాటలు విని ఈ ఖాళీలను పూర్తి చెయ్యండి..
-- ఛెళ్లుమంది, -- గుయ్యమంది, -- పగిలింది
(ఎవరినైనా అడిగి కూడా పూర్తి చేయవచ్చు)
సో, రేపు పనులు ముగించుకుని తీరికయ్యాక ఇంకా మిగిలి ఉన్న గజ్జి బ్యాచ్‌కి బడితి పూజ. సీయూ..’’ అంటూ పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.