యాప్నగరం

ఢిల్లీలో ఆప్ భారీ విజయంపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

డిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని చూస్తే ఆశ్చర్యమేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన గుంటూరు జిల్లా రేపల్లెలో పర్యటించారు.

Samayam Telugu 16 Feb 2020, 3:42 pm
ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం చూసి ఆశ్చర్యమేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తమ మిత్రపక్ష పార్టీ అయిన బీజేపీని సైతం ఎదుర్కొని వారు నిలబడ్డారని తెలిపారు. దీనికి కారణం ఆప్ నాయకత్వం ఢిల్లీలో ప్రజల అవసరాలు గుర్తించి.. వాటిని అమలు చేశారని తెలిపారు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ జనసేన కార్యకర్తలతో ఆదివారం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఢిల్లీలో ఆప్, బీజేపీలు ప్రజలను డబ్బుతో కొనలేదని తెలిపారు. కానీ, జనాలకు పని చేసింది కాబట్టే ఆప్ గెలిచిందని చెప్పారు. కష్టమో, నష్టమో తాను కూడా డబ్బుల్లేని రాజకీయాలు చేస్తానని వెల్లడించారు.
Samayam Telugu pawan kalyan


Also Read: అదే జరిగితే బీజేపీతో జనసేన పొత్తు ఉండదు.. పవన్ కళ్యాణ్ సంచలనం

డబ్బు తీసుకుని ఓటేసే జనాలు ప్రశ్నించే హక్కును కోల్పోతారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఓవైపు ఓటుకు రూ. 2 వేల చొప్పున తీసుకుంటుంటే మరోవైపు అవినీతిపరులను ప్రశ్నించే హక్కు ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. డబ్బుతో చేసే రాజకీయాలు వేరు.. ఆశయాలతో చేసే రాజకీయం వేరని చెప్పుకొచ్చారు. ధన రాజకీయాలు లేకుండా చూడాలని యువతకు పిలుపునిచ్చారు. మనకు సేవ చేసే వ్యక్తి ఎవరని అని ఆలోచించి ఓటెయ్యాలన్నారు. భవిష్యత్తులో జనసేన పార్టీ కచ్చితంగా ప్రజాదరణ పొందుతుందని తెలిపారు.

Also Read: ‘జనసేన ఎమ్మెల్యే రాపాకకు ఉన్న జ్ఞానం కూడా పవన్‌ కళ్యాణ్‌కు లేదు’

అందుకే సినిమాలు
కుటుంబం, పార్టీ నడపడానికి డబ్బు కావాలని, అందుకే సినిమాలు‌ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. సినిమా ద్వారా వచ్చిన డబ్బుతోనే పార్టీ నడుపుతున్నట్లు చెప్పారు. ఎవరికో కాంట్రాక్టులు ఇప్పించి.. వారిచ్చే డబ్బు తీసుకునే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో కుళ్లు కుతంత్రాలు వెన్నుపోటు ఉంటాయని తనకు తెలుసునని, కానీ రూ. 2 ‌వేలు ఇస్తేనే ఓటు‌ వేసేందుకు ప్రజలు పోలింగ్ బూత్‌లకు వచ్చే పరిస్థితి నెలకొనడం దారుణమన్నారు.

బీజేపీతో పొత్తు అంటే అనేక అభ్యంతరాలు చెప్పారని, కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించినట్లు పవన్ చెప్పారు. కులాలు, మతాల పేరుతో విడగొట్టే సమాజం ప్రజలకు మంచిది కాదన్నారు. వైసీపీ రెండు నాల్కల ధోరణితో ముస్లింలే నిలదీసే పరిస్థితి వచ్చిందని చెప్పారు. జనసేన ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుంది’ అని పవన్ స్పష్టం చేశారు.

Also Read: అమరావతిపై ఒట్టు వేయను.. నేనేమైనా ముఖ్యమంత్రినా.. జనసేనాని సంచలన వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.