యాప్నగరం

అలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు.. పవన్ ట్వీట్

జనసేన పార్టీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లను సస్పెండ్ చేయడంపై పవన్ కళ్యాణ్ ఫైర్. జనం సమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలబడటమే తప్పా అంటూ ట్వీట్ చేసిన జనసేనాని.

Samayam Telugu 18 Sep 2019, 2:37 pm
జనసేన పార్టీకి సంబంధించిన 400 ట్విట్టర్ ఖాతాలు సస్సెండ్ అయ్యాయి. జనసేనకు మద్దతుగా పని చేసే, శతఘ్ని టీంకు చెందిన ట్విట్టర్ ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. ఏపీ సీఎం జగన్ తనకు నచ్చని న్యూస్ ఛానెళ్లు, ట్విట్టర్ ఖాతాలను టార్గెట్ చేశారని.. కొందరు జనసైనికులు ఆరోపిస్తున్నారు. జనసేనను చూసి వైఎస్ఆర్సీపీ భయపడుతోందంటున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
Samayam Telugu pawan.


జనసేనాని తన ట్వీట్‌లో ‘జనసేనకు మద్దతుగా ఉన్న 400 ట్విట్టర్ అకౌంట్లు ఎందుకు సస్పెండ్ చేశారో అర్థం కావడం లేదు. నిస్సహాయులు, వారి సమస్యల్ని తెలుసుకొని అండగా నిలబడటం దీనికి కారణమా.. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి’అంటూ పవన్ ప్రశ్నించారు. #BringBackJSPSocialMedia అంటూ హ్యాష్ ట్యాగ్ ట్వీట్ చేశారు.
జనసైనికులతో గొంతు కలిపిన పవన్.. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్‌ (#BringBackJSPSocialMedia)ను నినాదంగా మార్చేశారు. జనసేన సోషల్ మీడియా ఖాతాలను మళ్లీ పని చేసేలా చూద్దామని అందరూ కలిసి పిలుపునిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.