యాప్నగరం

అమరావతిపై ఒట్టు వేయను.. నేనేమైనా ముఖ్యమంత్రినా.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

రాజధాని అమరావతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఇక్కడే ఉంటుందని ఒట్టు వేసేందుకు తానేమీ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాదని వ్యాఖ్యానించారు.

Samayam Telugu 15 Feb 2020, 6:45 pm
అమరావతి ఏకైక రాజధానిగా ఇక్కడే ఉంటుందని తాను ఒట్టు వేయలేనని, కానీ పోరాటం మాత్రం చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ శనివారం అమరావతి పరిధిలోని గ్రామాల్లో పర్యటించారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెంలో రైతుల దీక్షకు మద్దతు తెలిపి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ మహిళ అమరావతిపై ఒట్టేమని అడిగారని, అయితే ఒట్లు వేసేందుకు ఇది చిన్నపిల్లల ఆట కాదన్నారు. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం తన చేతిలో లేదని తెలిపారు. ఒట్టువేసేందుకు తానేమీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదని, ఈ విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.
Samayam Telugu pawan


Also Read: జగన్‌రెడ్డి గారూ.. ప్రీతికి న్యాయం చేయలేని సీఎం పదవి ఎందుకు: పవన్

రాజధాని అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, దీనిపై బీజేపీ రాజకీయంగా ఓ విధానం తీసుకోవచ్చుగాని.. కేంద్ర ప్రభుత్వం ఇందులో చేసేందుకు ఏమీ ఉండదని పవన్ వ్యాఖ్యానించారు. ఈ అంశం తన పరిధిలో ఉంటే ఒట్టేస్తానని, కానీ తనకేమీ జీవోలు ఇచ్చే అధికారాలు లేవని స్పష్టం చేశారు. అలాగే రాజధాని శ్రీకాకుళంలో పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, కానీ విశాఖపట్నం వంటి అభివృద్ధి చెందిన నగరంలో పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖలో పేదలు కనీసం ఇళ్లు అద్దెకు తీసుకోవాలన్నా చాలా ఖరీదుగా ఉంటాయని తెలిపారు. విజయవాడ, గుంటూరులో అయినా ఇళ్లు తక్కువ ధరకు అద్దెకు లభిస్తాయి గాని, విశాఖలో అద్దెలు చాలా ఎక్కువని తెలిపారు.

Also Read:

రాజధాని ఎక్కడ ఉండాలనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయని, అయితే 2014లో ఆ నిర్ణయం తీసేసుకున్నారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు వైసీపీ కూడా అంగీకరించిందని, ఇప్పుడు మారుస్తామంటే చూస్తూ ఊరుకోబోని వ్యాఖ్యానించారు. రాజధాని ఎక్కడికీ పోదని భరోసా ఇవ్వడానికే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. రైతులకు మద్దతుగా ఈ నెల 2న ర్యాలీ చేద్దామనుకున్నామని, కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా వేసినట్లు చెప్పారు. కేంద్ర పెద్దలను కూడా తీసుకొచ్చి త్వరలోనే ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని బీజేపీ పెద్దలు కూడా చెప్పారని తెలిపారు. మీరు ఓట్లేస్తారో లేదో తెలియదని, కానీ ఎవరు వచ్చినా రాకున్నా అమరావతి రైతులకు మాత్రం తాను అండగా ఉంటానని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

Also Read: డబ్బు తీసుకుని ఓట్లేస్తే ఇంతే.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.