యాప్నగరం

చిక్కుల్లో మాజీ మంత్రులు యనమల, చినరాజప్ప.. ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడికి రెండో వివాహం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో కేసు ఫైల్ చేశారు. తన భర్తకు రెండో పెళ్లి చేసే ప్రయత్నించారని.. కొందరు తనను బెదిరించారని మహిళ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది.

Samayam Telugu 13 Jun 2020, 2:26 pm
మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప చిక్కుల్లో పడ్డారు.. వారిద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడికి రెండో వివాహం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో కేసు ఫైల్ చేశారు. తన భర్తకు రెండో పెళ్లి చేసే ప్రయత్నించారని.. కొందరు తనను బెదిరించారని మహిళ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండంగి పొలీసు స్టేషన్ లో ఏడుగురిపై (క్రైం. నెం: 230) ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా చేర్చిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
Samayam Telugu యనమల,  చినరాజప్పపై కేసు


A1. పిల్లి రాధాకృష్ణ - భర్త
A2. పిల్లి సత్యనారాయణ - మావయ్య
A3. పిల్లి అనంతలక్ష్మి - అత్త, మాజీ ఎమ్మెల్యే, కాకినాడ రూరల్
A4. యనమల కృష్ణుడు - అధ్యక్షుడు, టీడీపీ, తుని నియోజకవర్గం.
A5. యనమల రామకృష్ణుడు, మాజీ ఆర్థిక మంత్రి
A6.నిమ్మకాయల చినరాజప్ప, మాజీ హోం మంత్రి.
A7.సరిదే హరి-మాజీ ఎంపిటీసి, ఇంద్రపాలెం, కాకినాడ రూరల్.

2011లో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ కుమారుడు రాధాకృష్ణను ప్రేమ వివాహం చేసుకున్నట్లు బాధితురాలు చెబుతోంది.
రెండు రోజుల క్రిందట మళ్లీ అతడికి మాజీ మంత్రి యనమల స్వగ్రామంలో రెండో వివాహం జరిపించేందుకు ప్రయత్నించారని చెబుతోంది.పెళ్లి పెద్దలుగా మాజీ మంత్రులు ఇద్దరూ వెళ్లారని ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వారిపై కేసులు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.