యాప్నగరం

ఏపీ టెన్త్, ఇంటర్ విద్యార్థుల కోసం.. రంగంలోకి దిగిన కేఏ పాల్

సీఎం జగన్ పరీక్షలు రద్దు చేస్తానని చేప్పే వరకూ దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. 35 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తాను అన్నారు.

Samayam Telugu 29 Apr 2021, 1:25 pm

ప్రధానాంశాలు:

  • ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ దీక్ష
  • టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుకు డిమాండ్
  • ఇప్పటికే ఏపీ హైకోర్టులో పాల్ పిటిషన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కేఏ పాల్
ఏపీలో టెన్త్, ఇంటర్ విద్యార్థుల కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాల్ నిరసన దీక్షకు దిగారు. సీఎం జగన్ పరీక్షలు రద్దు చేస్తానని చేప్పే వరకూ దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. 35 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తాను అన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీక్ష మాత్రమే కాదు.. టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం దారుణమన్నారు. కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేశారని.. ప్రభుత్వం ఎందుకు పంతానికి పోతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇటువంటి పరిస్థితిలో పిల్లలను పరీక్షలకు పంపుతారా.. మంత్రులు పంపుతారా అని ప్రశ్నించారు. ‘మీ పిల్లలవే ప్రాణాలా?’ అంటూ మండిపడ్డారు. పరీక్షలపై ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోకుంటే విద్యార్థులు కరోనాకు బలైపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ విద్యార్థుల భవిష్యత్, ప్రాణాలు గురించి ఆలోచించాలని కోరారు. రాష్ట్రంలో కావాల్సింది పొలిటికల్ ఫైటింగ్ కాదు.. ప్రజలు, విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.