యాప్నగరం

ప్రకాశం జిల్లా కలెక్టర్ బంపరాఫర్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ!

కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వ్యాపారులు కూడా కలెక్టర్ దెబ్బకు షాక్ తిన్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో నెటిజన్లు రంగంలోకి దిగారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ కామెంట్ చేస్తున్నారు.

Samayam Telugu 14 Jul 2020, 7:20 am
ప్రకాశం జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యాయి. వ్యాపారులతో సమావేశంలో చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియాను ఊపేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆంక్షలు ఎత్తి వేయాలని వ్యాపారులు కోరుతున్నారు. కొంతమంది వ్యాపారులు కలెక్టర్‌ పోలా భాస్కర్‌‌తో సమావేశమై చర్చించారు. ఓ వ్యాపారి కోవిడ్‌ కట్టడి చర్యలతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఇది సినిమా కాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా తాను ముందుకు వెళ్లాల్సిందే అన్నారు.
Samayam Telugu ఒంగోలు


అంతేకాదు ‘ఎవరికైనా ఆసక్తి ఉంటే రండి. నా కన్నా బాగా పని చేయగలమని మీరు అనుకొంటే.. ఒకరోజు కలెక్టర్‌గా పనిచేయడానికి అవకాశమిస్తాను. మీరేం చేస్తారో చూద్దాం’ అనేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వ్యాపారులు కూడా కలెక్టర్ దెబ్బకు షాక్ తిన్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో నెటిజన్లు రంగంలోకి దిగారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి కలెక్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.