యాప్నగరం

గుంటూరు జిల్లాలో సెక్స్ రాకెట్.. మహిళలు అరెస్టు.. విటులు పరారీ

హై సెక్యూరిటీ జోన్‌గా మారిన తాడేపల్లిలో తరచూ అసాంఘిక కార్యాకలాపాలు జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా తాడేపల్లి పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు చేశారు.

Samayam Telugu 20 Dec 2019, 9:11 pm
గుంటూరు పోలీసులు సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళలను అరెస్టు చేశారు. మహిళల వద్దకు వచ్చిన విటులు పోలీసుల రాకను గమనించి పరారైనట్లు తెలుస్తోంది.
Samayam Telugu sex-racket


తాడేపల్లి పట్టణ పరిధిలోని మహానాడు ప్రాంతంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు చేశారు. దాడుల్లో నలుగురు మహిళలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇద్దరు విటులు పరారైనట్లు సమాచారం. వ్యభిచార కేంద్రం నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు. పరారైన విటుల గురించి ఆరా తీస్తున్నారు.

Also Read: విశాఖ జిల్లాలో దారుణం.. మహిళా పోలీసుల తీరుతో మనస్థాపం.. పెట్రోల్ పోసుకుని..

హై సెక్యూరిటీ జోన్‌గా మారిన తాడేపల్లిలో తరచూ అసాంఘిక కార్యాకలాపాలు జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం.. పలు ప్రభుత్వ శాఖల రాష్ట్ర కార్యాలయాలు సైతం తాడేపల్లి పరిసరాల్లోనే కొలువుదీరాయి. ఏపీడీజీపీ కార్యాలయం.. పలువురు వీఐపీల నివాసం ఉంటున్నారు. అలాంటి హై సెక్యూరిటీ జోన్‌‌లోనూ అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకోవడం గమనార్హం.

Read Also: అప్పుడు ల్యాండ్ పూలింగ్‌.. ఇప్పుడు 3 రాజధానులట.! రాజధాని మహిళ ఆవేదన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.