యాప్నగరం

పీవీ సింధుకు జగన్ సర్కార్ కీలక పోస్టింగ్

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం కీలక పోస్టింగ్ ఇచ్చింది. డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణా కాలం పూర్తి చేసుకుని ఆమెను హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌ ఓఎస్‌డీగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రస్తుతం అక్కడ ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టును ఓఎస్‌డీగా అప్‌గ్రేడ్‌ చేయనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

Samayam Telugu 7 Dec 2019, 9:22 am

Samayam Telugu pv sindhu posted as a protocol osd for hyderabad lake view guest house
పీవీ సింధుకు జగన్ సర్కార్ కీలక పోస్టింగ్

సింధు డిప్యూటీ కలెక్టర్‌గా ఆన్ డ్యూటీ

గత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సింధుకి అప్పటి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ప్రకటించింది. డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు కూడా స్వీకరించారు. అలాగే ఆమెకు 2018 డిసెంబర్‌ 7 నుంచి 2020 ఆగస్టు 30 వరకు ఆన్‌ డ్యూటీ సౌకర్యం కూడా కల్పించారు. ఈ ఆన్‌ డ్యూటీ అంశాన్ని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

గత నెలలో సీఎం జగన్‌ను కలిసి పీవీ సింధు

పీవీ సింధు గత నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అమరావతిలో కలిశారు. ఈ భేటీలో తాను 2020లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్నట్లు పీవీ సింధు సీఎంకి తెలియజేశారు. సీఎం జగన్ కూడా ఒలింపిక్స్‌లో విజయం సాధించాలని ఆకాక్షించారు.. ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే గతంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీకి స్థలం గుర్తిస్తున్నట్లు తెలిపారు. అనువైన చోట స్థలం ఎంపిక చేసుకోవాలని సీఎం జగన్ సింధుకి సూచించినట్లు తెలుస్తోంది.

ఆన్ డ్యూటీ కోసం విజ్ఞప్తి చేసిన సింధు

అంతేకాదు ఈ భేటీలో టోక్యో ఒలింపిక్స్‌కి సిద్ధమవుతున్నానని.. అందువల్ల ఆ సమయాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించాలని జగన్‌కి షట్లర్ సింధు విజ్ఞప్తి చేశారు. ఆమె విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పీవీ సింధు ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్నారు.. ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నారు.

దిశ హత్యకేసు నిందితులు ఎన్‌కౌంటర్‌పై స్పందన

మరోవైపు హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పైనా పీవీ సింధు స్పందించారు. దిశకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని.. తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దిశ ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.

Twitter-Justice has been served! 🙏🏻🙏🏻 @TelanganaPolice...

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.