ఏపీని వాతావరణశాఖ అలర్ట్ చేసింది. రాష్ట్రంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. రాయలసీమ నుంచి కొమెరిన్ ప్రాంతం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒకటి విస్తరించింది. తెలంగాణ పరిసర ప్రాంతాల నుంచి సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు మరొకటి విస్తరించింది. తీర ప్రాంతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, 48 గంటల్లో ఉత్తర ఒడిసా తీరం దిశగా రానుంది. ఈ ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గురువారం ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, ఇతర జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడ్డాయి. అంతేకాదు ఏపీలోని పలు జిల్లాల్లో నాలుగైదు రోజులుగా వానలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది.. ఉదయం వేళ ఎండ కాచి సాయంత్రానికి వర్షం పడుతోంది.
ఏపీకి వాతావరణశాఖ అలర్ట్.. ఆ నాలుగైదు జిల్లాల్లో భారీ వర్షాలు
ఈ ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో నాలుగైదు రోజులుగా వానలు పడుతున్నాయి.
Samayam Telugu 24 Sep 2021, 11:09 am
ప్రధానాంశాలు:
- ఏపీకి రెయిన్ అలర్ట్
- రెండ్రోజులు వర్షాలు
- ఈ జిల్లాల్లో వానలు