యాప్నగరం

ఏపీకి మరోసారి అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్!

నైరుతి బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. ఇది సముద్ర తలానికి 3.1 కిలోమీటర్ల ఎగువన కొనసాగుతోందని తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

Samayam Telugu 18 Jan 2022, 1:53 pm

ప్రధానాంశాలు:

  • ఏపీకి మరోసారి వాతావరణశాఖ వర్ష సూచన
  • మంగళవారం పలు జిల్లాల్లో వానలకు ఛాన్స్
  • గతవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఏపీకి వర్ష సూచన
ఏపీలో మంగళవారం పలు చోట్ల ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ విభాగం అంచనా వేసింది. నైరుతి బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. ఇది సముద్ర తలానికి 3.1 కిలోమీటర్ల ఎగువన కొనసాగుతోందని తెలిపింది. గత నాలుగైదు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా ఏపీలో చలి తీవ్రత పెరిగింది. కోస్తాంధ్ర, యానాంలో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాల వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో.. రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గుంటూరు, క్రిష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సైతం చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాయలసీమలోని పలు జిల్లాల్లో మంగళవారం చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని.. మంగళవారం నుంచి వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.