యాప్నగరం

రమణ దీక్షితులు పేరుతో ఫేక్ అకౌంట్.. తప్పుడు ప్రచారం

రమణ దీక్షితుల పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్.. పోలీసులకు ఫిర్యాదు. తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ అకౌంట్ ఎవరు ఓపెన్ చేసిన వారి వివరాల గురించి ఆరా తీస్తున్నారు.

Samayam Telugu 2 Apr 2020, 11:47 am
తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారు రమణ దీక్షితులకు సోషల్ మీడియా కష్టాలు వచ్చాయి. ఆయన పేరు మీద ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం కలకలంరేపింది. తనకు సంబంధం లేకుండానే.. తన ఫోటో, పేరుతో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసినట్లు పోలీసులు దీక్షితులు ఫిర్యాదు చేశారు. ఆ అకౌంట్ క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Samayam Telugu ttd


తన పేరు మీద నకిలీ అకౌంట్‌ను క్రియేట్ చేసిన వాళ్లు.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రమణ దీక్షితులు ఆరోపించారు. తన పేరు మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంటున్నారు. దీక్షితులు ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ అకౌంట్ ఎవరు ఓపెన్ చేసిన వారి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.