యాప్నగరం

‘ఉదయం 6 నుంచే రేషన్ పంపిణీ.. ఎవరి పెన్ను వారు తెచ్చువాల్సిందే..’

Coronavirus in AP: రేషన్ సరుకులు ఆదివారం ఉదయం 6 గంటల నుంచే పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు.

Samayam Telugu 28 Mar 2020, 11:25 pm
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రేషన్‌ బియ్యం, కందిపప్పు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పంపిణీ చేస్తామని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. విజయవాడ నగరంలో 3 లక్షల మందికి రేషన్ పంపిణీ చేయనున్నామని, వచ్చే నెల 15 వరకు ఎవరికీ ఇబ్బంది లేకుండా పంపిణీ చేస్తామని చెప్పారు. రేషన్ పంపిణీలో సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.
Samayam Telugu pjimage - 2020-03-28T232435.609


రాష్ట్రంలో పాత విధానంలోనే రేషన్ సరకుల పంపిణీ చేస్తామని, అన్ని దుకాణాల్లో సరుకులు సరిపడా ఉన్నాయని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. సరకులు తీసుకునేందుకు వేలిముద్రలు వేయాల్సిన పనిలేదని, సంతకం చేసేందుకు ఎవరి పెన్ను వారు తెచ్చుకుంటే సరిపోతుందని తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలించడానికి ప్రధాన కారణం రద్దీ నియంత్రించడానికేనని చెప్పారు. విజయవాడలో ఇప్పటికీ చాలా మంది రోడ్లపైకి వస్తున్నారని, ప్రజలు అర్థం చేసుకుని అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అలాగే ప్రజలు సామాజిక దూరం పాటించాలని కోరారు.

విజయవాడలో 1,138 మంది విదేశీయులువిదేశాల నుంచి విజయవాడకు 1,138 మంది వచ్చారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. వీరంతా 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరినట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో సమాచారం పూర్తిగా సేకరించి, వీరు ఎవరితో కలిశారు? ఎక్కడ తిరిగారో గుర్తిస్తామన్నారు. ఇంటికి ఒక్కరు మాత్రమే సరకుల కొనుగోలుకు రావాలని ఎమ్మెల్యే నగర వాసులకు సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.