యాప్నగరం

కర్నూలు: టీడీపీకి రాజధాని సెగ.. పార్టీ ఆఫీస్‌ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు

టీడీపీకి రాజధాని సెగ తగిలింది.. శాసనమండలిలో పరిణామాలు, టీడీపీ తీరుపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపిన విద్యార్థి సంఘాలు.

Samayam Telugu 23 Jan 2020, 12:43 pm
టీడీపీకి రాజధాని సెగ తగలింది. శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకించి సెలక్ట్ కమిటీకి పంపించడాన్ని నిరసిస్తూ.. కర్నూలులో విద్యార్థి సంఘాలు నిరసన తెలియజేశాయి. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించాయి. ఆఫీస్ బయట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించాయి. వెంటనే పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి సద్ధుమణిగింది.
Samayam Telugu knl
File Photo


ఇదిలా ఉంటే రాయలసీమతో పాటూ ఉత్తరాంధ్రలో కూడా చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేతలు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారని.. ఆయన రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. అక్కడక్కడా చంద్రబాబు దిష్టిబొమ్మల్ని దగ్థం చేశారు. టీడీపీ నేతల ఇళ్ల ముట్టడికి ప్రయత్నిస్తున్నారు.

బుధవారం శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించిన సంగతి తెలిసిందే. దీన్ని నిరసిస్తూ రాయలసీమతో పాటూ ఉత్తరాంధ్రలో టీడీపీకి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. అంతేకాదు బుధవారం విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంటిని ముట్టడించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.