యాప్నగరం

నరసరావుపేటలో కలకలం.. భారీమొత్తంలో బంగారు నగలు చోరీ

భారీ మొత్తంలో బంగారు నగల చోరీ గుంటూరు జిల్లా నరసరావుపేటలో కలకలం రేపింది. పట్టణంలోని వైభవ్ జ్యూయలర్స్ షాపు యజమాని ఇంట్లో ఉంచిన రెండు కిలోల బంగారు నగలు దోచుకెళ్లారు.

Samayam Telugu 12 Oct 2019, 1:10 pm
తమిళనాడులోని తిరుచ్చి లలితా జ్యూయలర్స్‌లో కోట్ల విలువైన బంగారు నగలు చోరీ జరిగిన సంగతి తెలిసిందే. దొంగలు చక్కగా వచ్చి ఎంచక్కా పని కానిచ్చేసి వెళ్లిపోయారు. అలాంటి భారీ దొంగతనం మరొకటి ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. కోట్లలో కాకపోయినా భారీగానే బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. రెండు కిలోలకు పైగా బంగారం దొచుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
Samayam Telugu gold-bahraini-


Also Read: ప్రియురాలిని అడవిలో దాచిన ప్రియుడు.. భార్యకు విషయం తెలియడంతో ఆత్మహత్య..

నరసరావుపేటకు చెందిన వైభవ్ జ్యూయలర్స్ యజమాని పెనుగొండ ప్రతాప్ ఆ నెల 6న బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి 9వ తేదీన ఇంటికి వచ్చారు. దాచి ఉంచిన బంగారు నగల కోసం బీరువా తెరిచి చూసి హతాశుడయ్యాడు. బీరువా లాకర్‌లో ఉంచిన బంగారు నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇంటికి వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి కానీ ఇంట్లో బంగారు నగలు మాయమయ్యాయని వాపోయాడు. రెండు కిలోల బంగారు నగలు అపహరణకు గురైనట్లు ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ సేకరించే పనిలో పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.