యాప్నగరం

జేసీ దివాకర్‌రెడ్డి డబ్బు మాయం.. రూ.6లక్షలు చోరీ

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సూట్‌కేసు నుంచి రూ.6లక్షలు మాయం. పోలీసులకు ఫిర్యాదు చేసిన జేసీ.. విచారణలో డ్రైవర్ డబ్బు తీసినట్లు నిర్థారణ. విజయవాడలో ఈ నెల 11న జరిగిన ఘటన.

Samayam Telugu 14 Oct 2019, 3:07 pm
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి సూట్‌కేసులో రూ.6లక్షలు మాయం కావడం కలకలంరేపింది. విజయవాడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. జేసీ దివాకర్‌రెడ్డి ఈనెల 11న దివాకర్‌రెడ్డి విజయవాడ వచ్చారు.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో గది తీసుకున్నారు. తర్వాత తన వ్యక్తిగత పనిమీద కారులో సచివాలయానికి వెళ్లారట.. తిరిగి అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హోటల్‌ దగ్గరకు చేరుకున్నారు.
Samayam Telugu diwakar


కారులో నుంచి దిగిన జేసీ దివాకర్ రెడ్డి నేరుగా హోటల్ గదిలోకి వెళుతూ.. కారులో ఉన్న సూట్‌కేసు తీసుకువచ్చి తన రూమ్‌లో పెట్టమని కారు డ్రైవర్‌ గౌతమ్‌కు చెప్పారట. తర్వాత డ్రైవర్‌ సూట్‌ కేసు తీసుకొచ్చి దివాకర్‌రెడ్డి బస చేసిన రూమ్‌లో పెట్టి వెళ్లిపోయాడు. అదే రోజు సాయంత్రం 6 గంటల సమయంలో జేసీ దివాకర్‌రెడ్డి సూట్‌ కేసు బయటకు తీసి చూసుకోగా అందులో రూ.6 లక్షలు మాయం అయ్యాయి.

డబ్బు కనిపించకపోవడంతో కంగారుపడిన జేసీ దివాకర్ రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ సూట్‌కేస్‌ను కారులో నంచి తీసుకొచ్చి జేసీ గదిలో పెట్టింది డ్రైవర్‌ గౌతమ్ కావడంతో.. అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో తాను ఆ డబ్బు తీసినట్లు ఒప్పుకున్నాడు. సూట్‌కేసులో నుంచి డబ్బు తీసి కారు సీటు కవర్‌లో పెట్టినట్లు చెప్పాడు. డబ్బు సీజ్ చేసి.. డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. తన కారు డ్రైవరే ఇలా దొంగతనం చేయడంతో జేసీ కూడా షాక్ తిన్నారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.