యాప్నగరం

ఏపీ: మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ.వెయ్యి జరిమానా

ఎవ‌రైనా మాస్కులు లేకుండా బయటకు వస్తే రూ. 1000 జరిమానా విధిస్తామంటున్నారు. ఇక కూరగాయలు, నిత్యావ‌సరాలు కొనుగోలు చేసేందుకు ఒక్కరే రావాలని సూచించారు.

Samayam Telugu 10 Apr 2020, 7:58 am
ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుందని భావించినా.. కొన్ని జిల్లాల్లో మాత్రం ఆ సంఖ్య పెరుగుతోంది. ఇక గుంటూరు జిల్లాలో కేసులు పెరగడంతో పాటూ నర్సరావుపేటలో ఒకరు చనిపోయారు. ప్రస్తుతం జిల్లాలో 51 కేసులు ఉన్నాయి. దీంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు.. లాక్‌డౌన్‌ మరింత కఠినంగా గా అమ‌లు చేయాలని నిర్ణయించారు. నిబంధనల్ని కూడా పక్కాగా అమలు చేయాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు.
Samayam Telugu gnt


Read Also: జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రతి గ్రామం, వార్డుల్లో..!

ఇక జిల్లావ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్క్‌లు ధరించాలని అధికారులు ప్ర‌జ‌ల‌కు సూచించారు. ఎవ‌రైనా మాస్కులు లేకుండా బయటకు వస్తే రూ. 1000 జరిమానా విధిస్తామంటున్నారు. ఇక కూరగాయలు, నిత్యావ‌సరాలు కొనుగోలు చేసేందుకు ఒక్కరే రావాలని సూచించారు. గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగులు ఉదయం 10 గంటలలోపు ఆఫీసుల‌కు చేరుకోవాలని.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు రోడ్లపైకి ఉద్యోగులను అనుమతించేది లేద‌ని క్లారిటీ ఇచ్చారు.

Also Read: 'చంద్రబాబు ఏపీకి రావాలంటే 14 రోజులు క్వారంటైన్‌కు...

Don't Miss: ఏపీలో వర్ష బీభత్సం.. నెల్లూరు జిల్లాలో ఏడుగురు చనిపోయారు...

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్, బఫర్ జోన్‌లుగా ప్రకటిస్తున్నారు. క్లస్టర్లుగా విభజిస్తున్నారు. అలాగే ముందస్తు జాగ్రత్తగా కొన్ని నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలో అయితే బహిరంగంగా ఉమ్మినా చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండంతో అధికారులు కూడా కీలక నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.