యాప్నగరం

చిత్తూరులో దారుణం.. విద్యార్థినిపై కన్నేసిన కీచక టీచర్.. సెలవుల్లో ఇంటికి పిలిపించుకుని..

తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పండుగ సెలవులకు ఇంటికి వచ్చింది. ఇదే అదనుగా భావించిన కీచక టీచర్ ఆమెకు ఫోన్ చేసి మదనపల్లె గురుకుల పాఠశాల క్వార్టర్స్‌కు పిలిపించుకున్నాడు.

Samayam Telugu 18 Jan 2020, 9:06 pm
తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిని కీచక టీచర్ క్వార్టర్స్‌కి పిలిపించుకుని మరీ అత్యాచారానికి పాల్పడిన అత్యంత దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పండుగ సెలవులకు ఇంటికి వచ్చిన బాలికను క్వార్టర్స్‌కి పిలిపించుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పశువాంఛ తీర్చుకున్న అనంతరం ఆమెను ఇంటికి పంపించాడు. ఇంతసేపు ఎక్కడికెళ్లావని అడిగిన ఆ తల్లిదండ్రులు విద్యార్థిని చెప్పిన మాటలు విని హతాశులయ్యారు.
Samayam Telugu rape2


నగరి మండలం కేవీ పురానికి చెందిన గిరిజ మదనపల్లె గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె అక్క కొడుకు టీవీ నవీన్ కుమార్ పదేళ్లుగా గురుకుల పాఠశాల క్వార్టర్స్‌లోనే పిన్నితో కలిసి ఉంటున్నాడు. ఇటీవలే బి.కొత్తకోట ఏపీ మోడల్ స్కూల్‌లో తెలుగు టీచర్‌గా ఉద్యోగంలో చేరాడు. మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపాలేనికి చెందిన ఓ బాలిక బి.కొత్తకోట మోడల్ స్కూల్‌లో మూడేళ్లుగా చదువుతోంది.

Also Read: ఎకరానికి రూ.10 కోట్లు..‘అమరావతి’పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పండుగ సెలవులకు మదనపల్లె వచ్చింది. ఇదే అదనుగా భావించిన కీచక టీచర్ ఆమెకు ఫోన్ చేసి మదనపల్లె గురుకుల పాఠశాల క్వార్టర్స్‌కు పిలిపించుకున్నాడు. బాలికపై పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డాడు. ఉదయం వచ్చిన బాలికపై అనేక మార్లు లైంగిక దాడికి పాల్పడిన అనంతరం ఇంటికి పంపించేశాడు.

ఉదయం ఎప్పుడో వెళ్లిన కూతురు ఆలస్యంగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు గట్టిగా అడగడంతో జరిగిన విషయం చెప్పి విద్యార్థిని భోరుమంది. తమ కూతురుకి జరిగిన అన్యాయాన్ని విని ఆ తల్లిదండ్రుల గుండె బద్దలైంది. తేరుకుని తమ కుమార్తె జీవితాన్ని నాశనం చేసిన టీచర్‌పై బాలిక తల్లిదండ్రులు మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read Also: బీజేపీతో జనసేన పొత్తు.. పవన్ కళ్యాణ్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.