యాప్నగరం

ఉద్యోగ సంఘాల నేత వ్యాఖ్యలు ప్రాణహాని కలిగించే బెదిరింపులే: డీజీపీకి ఎస్‌ఈసీ ఫిర్యాదు!

AP Local Body Elections నాలుగు దశలకూ ఒకేసారి నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం‌ జారీ చేసింది. దాన్ని ప్రభుత్వం లెక్క చేయలేదు. ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదన్న వైఖరి¸ పునరుద్ఘాటించింది.

Samayam Telugu 24 Jan 2021, 7:05 am
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అటు ఎన్నికల సంఘం.. ఇటు ప్రభుత్వం ఎవరూ వెనక్కు తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు శనివారం ఎస్‌ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. కరోనా వ్యాక్సినేషన్ తీసుకునే వరకూ ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఉద్యోగ సంఘాలు తేల్చిచెప్పాయి. అంతేకాదు, రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ వారి ప్రాణాల్ని కాపాడుకునే హక్కు కల్పించిందని, ఆ క్రమంలో చంపే హక్కూ ఇచ్చిందని ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
Samayam Telugu ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్
State Election Commissioner Nimmagadda Ramesh Kumar


ఈ వ్యాఖ్యలు తనకు ప్రాణహాని కలిగించేందుకు చేసిన బెదిరింపుల్లా భావిస్తున్నానని, తనకు ప్రాణహాని ఉందంటూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ లేఖ రాశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. నాకు ప్రాణహాని కలిగించేలా చేసిన బెదిరింపుల్లా భావిస్తున్నాను ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలి.. వెంకట్రామిరెడ్డి కార్యకలాపాలు తనపై భౌతిక దాడికి దారితీసే అవకాశం ఉన్నందున ఆయనపై నిఘా పెట్టాలి’ అని డీజీపీకి రాసిన లేఖలో నిమ్మగడ్డ రమేశ్‌ పేర్కొన్నారు.

‘శనివారం ఉదయం రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిందని, ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వెంకట్రామిరెడ్డి ‘రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ వారి ప్రాణాల్ని కాపాడుకునే హక్కు కల్పించింది. ఆ క్రమంలో చంపే హక్కూ ఇచ్చింది’ అంటూ మాట్లాడారు..ఈ వ్యాఖ్యలు తీవ్రంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఇవి అత్యంత దురదృష్టకరం’ అని డీజీపీకి రాసిన లేఖలో ఎస్ఈసీ వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.